వామ్మో... ఈ ఫోన్ డిస్‌ప్లే 6.6 అంగుళాలు

హువావే ఆన్‌లైన్ బ్రాండ్ హానర్ ఏకంగా 6.6 అంగుళాల భారీ డిస్‌ప్లేతో కూడిన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది.

వామ్మో... ఈ ఫోన్ డిస్‌ప్లే 6.6 అంగుళాలు

హానర్ నోట్ 8 పేరుతో లాంచ్ అయిన ఈ భారీ డివైస్ లెనోవో ఫాబ్ ప్లస్, షియోమీ ఎంఐ మాక్స్ ఫాబ్లెట్‌లకు ప్రధాన పోటీగా నిలిచింది. గోల్డ్, సిల్వర్ ఇంకా గ్రే కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉండే ఈ డివైస్‌ను ఆగష్టు 9 నుంచి అక్కడి మార్కెట్లలో లభ్యమవుతుంది. ఫోన్ ప్రత్యేకతలు పరిశీలించినట్లయితే...

Read More : నేలంటూ కనిపించి గ్రహంలోకి 'జునో వాహకనౌక'!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పూర్తి మెటల్ బాడీతో

Honor Note 8 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. ఫోన్ బరువు 219 గ్రాము వరకు ఉంటుంది. మందం 7.18 మిల్లీ మీటర్లు.

క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

హానర్ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి హానర్ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ కైరిన్ 955 ప్రాసెసర్ విత్ Mali T880-MP4 జీపీయూతో వస్తోంది.

ర్యామ్, స్టోరేజ్

Honor Note 8 స్మార్ట్‌ఫోన్‌ ర్యామ్ ఇంకా స్టోరేజ్ సామర్థ్యాలను పరిశీలించినట్లయితే... 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి 64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

కెమెరా విషయానికి వచ్చేసరికి

Honor Note 8 స్మార్ట్‌ఫోన్‌.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

Honor Note 8 స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

కనెక్టువిటీ ఫీచర్లు

4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్త్-సీ

బ్యాటరీ

హానర్ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor Note 8 Goes Official with 4GB RAM, USB Type-C Port: All You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot