రూ. 6400కే 24 MP సెల్ఫీ కెమెరా ఫోన్, హానర్ మరో సంచలనం

|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ మార్కెట్లో దిగ్గజాలకు షాకిచ్చింది. అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ ను లాంచ్ చేసింది. హానర్‌ ప్లే 7 పేరుతో ఈ డివైస్‌ను చైనా మార్కెట్‌లో అధికారింగా విడుదల చేసింది. దీని ధర అక్కడ CNY 599గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దీని ధర సుమారు 6,400 రూపాయలుతో సమానం. అయితే కంపెనీ నుంచి భారత మార్కెట్‌లో లాంచింగ్‌, ధర తదితర అంశాలపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కళ్లకు రక్షణకోసం బ్లూ లైట్‌ ఫిల్టర్‌, స్మార్ట్‌ వాల్యూమ్‌ కంట్రోల్‌, త్రి ఫింగర్‌ స్క్రీన్‌ షాట్‌ ఫీచర్లు ప్రధానమైనవిగా కంపెనీ చెబుతోంది.

 

వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్‌లో భారీ మార్పులు, అప్‌డేట్ పొందడం ఎలా ?వాట్సప్ వీడియో కాలింగ్ ఫీచర్‌లో భారీ మార్పులు, అప్‌డేట్ పొందడం ఎలా ?

హానర్‌ ప్లే7 ఫీచర్లు

హానర్‌ ప్లే7 ఫీచర్లు

5.45 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
720x1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌
క్వాడ్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ఎస్‌వోసీ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
13ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ డ్యుయల్‌ టోన్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3020ఎంఏహెచ్‌ బ్యాటరీ

 Honor 7A and Honor 7C

Honor 7A and Honor 7C

కాగా కంపెనీ నుంచి Honor 7A and Honor 7Cలు వచ్చే వారం ఇండియాలో విడుదల కానున్నాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇవి ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులోకి రానున్నాయి. హానర్ 7ఎ రూ.8,250 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

 హానర్ 7ఎ ఫీచర్లు
 

హానర్ 7ఎ ఫీచర్లు

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హువావే హానర్ 7సి

హువావే హానర్ 7సి

ఈ ఫోన్ రూ.9,235 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.
హువావే హానర్ 7సి ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor Play 7 With 24-Megapixel Selfie Camera And 18:9 Display Launched in China More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X