మిడ్‌రేంజ్ ధరలో బెస్ట్ ఫీచర్లతో యూజర్లను కట్టిపడేస్తున్న స్మార్ట్‌ఫోన్

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడు అంతా మిడ్‌రేంజ్ ధరల ఫోన్ హవా నడుస్తోంది. వినియోగదారుల మైండ్ సెట్ ని క్యాచ్ చేసిన దిగ్గజ కంపెనీలు కూడా ఆ వైపుగానే అడుగులలు వేస్తున్నాయి.

|

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడు అంతా మిడ్‌రేంజ్ ధరల ఫోన్ హవా నడుస్తోంది. వినియోగదారుల మైండ్ సెట్ ని క్యాచ్ చేసిన దిగ్గజ కంపెనీలు కూడా ఆ వైపుగానే అడుగులలు వేస్తున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు మాత్రమే తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హానర్ కంపెనీ ఓ అడుగు ముందుకేసింది.

అత్యంత తక్కువ ధరలో అధ్భుత ఫీచర్లతో హానర్ ప్లే పేరుతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. గేమ్ రిలేటెడ్ GPU Turbo tech టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మల్టిటాస్కింగ్ ఫీచర్, కెమెరా, సాప్ట్ వేర్, సెక్యూరిటీలో ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తోందని రివ్యూలు సైతం చెబుతున్నాయి.ధర

honor play smartphone

Honor Play స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది . మొదటి వేరియంట్ 4జిబి/64gb వేరియంట్ ధర రూ. 19,990 కాగా రెండవ వేరియంట్ ధర రూ. 23,999 గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ అమెజాన్ కి లో అమ్మకానికి వచ్చిన 20 సెకన్లలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ దర్శనమిచ్చింది.

హానర్ ప్లే ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

honor play smartphone

భారీ డిస్‌ప్లే
హానర్ ప్లే స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే టర్బో గ్రాఫిక్స్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్‌లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. దీంతో పాటు స్మార్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్ ను కల్పించారు. దీని ద్వారా మీరు అత్యంత వేగంగా ఫోన్ అన్ లాక్ తీయవచ్చు.

honor play smartphone

రెండు కెమెరాలు
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని కలిగి ఉంటాయి. Scene Detection ,Portrait Mode వంటి పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు.

honor play smartphone

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం
Honor Play స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3750 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ సపోర్ట్ ఈ ఫోన్ కి అదనపు బలాన్ని అందిస్తోంది. ఈ ఫోన్‌లో 3డీ ఆడియో టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌లో ఆడియో మంచి క్వాలిటీని కలిగి ఉంటుంది. యూజర్లకు సౌండ్ విషయంలో చక్కని అనుభూతి కలుగుతుంది.

honor play smartphone

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్
అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 970తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE, USB Type-C అదనపు ఆకర్షణలు.

Best Mobiles in India

English summary
Honor Play: Experience flagship performance in mid-range price-point more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X