ఇండియా మార్కెట్లోకి దూసుకొస్తున్న సరికొత్త గేమింగ్ ఫోన్ Honor Play
హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor Play మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇండియాలో ఈ రోజు లాంచ్ ఈవెంట
హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor Play మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇండియాలో ఈ రోజు లాంచ్ ఈవెంట్ జరగనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ ప్రియులను ఉద్దేశించి తయారుచేసినట్టు కంపెనీ తెలిపింది. ఇండియా మార్కెట్లో Honor Play స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో ఎక్సక్లూజివ్ గా అమ్మకానికి రానుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లైవ్ ఈవెంట్ ని అభిమానులు YouTube ద్వారా తిలకించవచ్చు. ఈ ఫోన్ ఫీచర్స్ కింది విధంగా ఉన్నాయి.

ధర :
ఈ Honor Play స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది . మొదటి వేరియంట్ ధర రూ. 21,000 కాగా రెండవ వేరియంట్ ధర రూ. 25,100 గా కంపెనీ నిర్ణయించింది.

డిస్‌ప్లే :
6.3 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. గేమింగ్ ప్రియులను ఉద్దేశించి తయారుచేయబడ్డ ఈ Honor Play గేమ్స్ ఆడేటప్పుడు ఒక మంచి అనుభూతుని ఇస్తుంది అని కంపెనీ తెలిపింది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :
అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 970తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ/6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE, USB Type-C . అదనపు ఆకర్షణలు.

కెమెరా :
రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది.బ్యాక్ కెమెరా విషయానికొస్తే 16మెగాపిక్సల్ cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.అలాగే Scene Detection ,Portrait Mode వంటి పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 16మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :
ఈ Honor Play స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3750 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

Honor Play ఫీచర్స్ :
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కిరిన్ 970 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ , 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.1 Oreo , 4జీ వీవోఎల్‌టీఈ , బ్లూటూత్ 4.2.


Click it and Unblock the Notifications








