50MP OIS కెమెరా, 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్.. కేవలం 209 గ్రాముల బరువుతో హానర్ పవర్ వచ్చేసింది..
HONOR Power Smartphone : HONOR కంపెనీ చైనాలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ మొబైల్ (HONOR Power)ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో భారీ 8000mAh మూడవ తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్నా కాకుండా, ఈ ఫోన్ చాలా సన్నగా, తేలికగా ఉంది. దీని బరువు కేవలం 209 గ్రాములు, మందం 7.98mm మాత్రమే.
ఇంత పెద్ద బ్యాటరీతో ఇంత స్లిమ్ డిజైన్‌లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. పెద్ద బ్యాటరీ ఉన్నా చేతిలో బరువుగా అనిపించదు. స్టైల్, కంఫర్ట్ విషయంలో రాజీ పడకుండా ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారిని ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది.

* అదిరిపోయే డిస్‌ప్లే, అదరగొట్టే పర్ఫార్మెన్స్..
హానర్ పవర్ ఫోన్‌లో 6.78 అంగుళాల అమోలెడ్ (AMOLED) స్క్రీన్ ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ (2700 × 1224 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది ఏకంగా 4000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, 10-బిట్ కలర్ డెప్త్, 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ అందిస్తుంది.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 (Snapdragon 7 Gen 3) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4nm టెక్నాలజీపై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఎడ్రినో 720 GPU (Adreno 720 GPU) ఉంది. 12GB వరకు LPDDR5 RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
* కనెక్టివిటీలో కొత్త హంగులు
బేస్‌మెంట్లు లేదా ఎలివేటర్ల వంటి సిగ్నల్ తక్కువగా ఉన్న చోట్ల కూడా సిగ్నల్ స్థిరంగా ఉండేందుకు, HONOR సంస్థ తమ సొంతంగా అభివృద్ధి చేసిన C1+ కమ్యూనికేషన్ చిప్‌ను ఇందులో అమర్చింది. విశేషమేమిటంటే, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా టెక్స్ట్ మెసేజ్‌లు పంపించుకోవడానికి వీలుగా బైడూ (Beidou) శాటిలైట్ మెసేజింగ్ సదుపాయం కూడా ఉంది.
ఇంకా వై-ఫై 7 (Wi-Fi 7), బ్లూటూత్ 5.3 (Bluetooth 5.3), 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS (L1+L5), NFC, యూఎస్‌బీ టైప్-సి (USB Type-C) కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పుకోవచ్చు.
* కెమెరా, క్వాలిటీ
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా (f/1.95 అపెర్చర్, OIS సపోర్ట్‌తో) ఉంది. దీనికి తోడుగా వైడ్ యాంగిల్ షాట్స్ కోసం 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు పిల్-ఆకారపు కటౌట్‌లో 16MP కెమెరా అమర్చారు.
ఈ ఫోన్‌తో 4K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఇక ఫోన్ గట్టిదనం గురించి చెప్పాలంటే, దీనికి టెన్-సైడెడ్ యాంటీ-ఫాల్ షాక్-అబ్సార్బింగ్ స్ట్రక్చర్ 2.0 ఉంది. అంటే, ఫోన్ కిందపడినా సులభంగా దెబ్బతినదు. అలాగే 360° వాటర్‌ప్రూఫ్ డిజైన్ వల్ల, నీటిలో పూర్తిగా మునిగినా కూడా పాడవకుండా పనిచేస్తుంది.
* బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్
ఈ ఫోన్‌లోని 8000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. ఈ మొబైల్ కి హైలైట్ ఇదే. ఇది కేవలం పెద్దది మాత్రమే కాదు, ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. 1000 సార్లు పూర్తి ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ ఆరోగ్యం 80% పైగా ఉంటుందని హానర్ కంపెనీ చెబుతోంది.
ఇది 66W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 68 నిమిషాల్లో 3 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, అవసరమైనప్పుడు ఇతర డివైస్‌లను ఛార్జ్ చేయడానికి 5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
* వేరియంట్లు, రంగులు, ధరల వివరాలు
హానర్ పవర్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9.0 (MagicOS 9.0) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో రెండు నానో సిమ్ కార్డులను వేసుకోవచ్చు. ఇది స్నో వైట్ (Snow White), ఫాంటమ్ నైట్ బ్లాక్ (Phantom Night Black), డెసర్ట్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
చైనాలో దీని ధరలు ఇలా ఉన్నాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 1,999 చైనీస్ యువాన్లు (సుమారు 272 డాలర్లు/ రూ.23,310).. 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 2,199 యువాన్లు (సుమారు 299 డాలర్లు/ రూ.25,640)గా ఉన్నాయి.
12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్లు (సుమారు 340 డాలర్లు/ రూ.29,140). ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. హానర్ పవర్ ఫోన్ మంచి పర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, ఆకట్టుకునే స్లిమ్ డిజైన్, కొన్ని ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వస్తోంది.


Click it and Unblock the Notifications