Robot Phone : ట్రెండింగ్‌లో ఉన్న రోబోట్ ఫోన్ గురించి తెలుసా.. కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు..!
టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఈ మేరకు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యమైన కెమెరాలు, పవర్‌ఫుల్ చిప్, భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తోన్నాయి.
ఇటీవలే శాంసంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ లో ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రైవసీ కోరుకొనే వారి కోసం ప్రైవసీ గార్డ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. హార్డ్‌వేర్ స్థాయిలోనే ఈ ఫీచర్ ను శాంసంగ్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఫోన్ ను ఎదురుగా చూస్తున్న యూజర్లకే డిస్‌ప్లే కనిపిస్తుంది. పక్కనున్న వారికి బ్లాక్ గా కనిపిస్తుంది. మెట్రో, రైళ్లు, బస్సులో ప్రయాణాల సమయాలు సహా ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ అనుకూలంగా ఉంటుంది.

రోబోట్ ఫోన్ :
మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 లో (MWC 2026) తన వినూత్నమైన టెక్నాలజీతో అందరికీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో హానర్ సంస్థ రోబోట్ ఫోన్ (Honor Robot Phone) ప్రోటోటైప్ ను ప్రదర్శించింది. దీంతోపాటు ఫోన్ కు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించింది.
మెకానికల్ గింబల్ :
హానర్ రోబోట్ ఫోన్‌లోని రోబోటిక్ గింబల్ కెమెరా ప్రధానంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ లోపలే 3 యాక్సెస్ మెకానికల్ గింబల్ ను అమర్చారు. ఇందులో 200MP కెమెరా ఉంటుంది. 40 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడం మోషన్ కంట్రోల్ ను కూడా కలిగి ఉంది.
It used to be a concept, but now it has come into reality --
— HONOR (@Honorglobal) March 1, 2026
HONOR Robot Phone embodies a new form of AI device featuring both intelligence and vitality
It is a robot phone from the future, an intelligent companion for you.⚡️ pic.twitter.com/S8CtdpUTQy
ఆటోమేటిక్‌గా తిరుగుతూ :
సింపుల్ గా చెప్పాలంటే ఈ రోబోటిక్ గింబల్.. రోబో చేతి తరహాలో పనిచేస్తుంది. ప్రొఫెషనల్ తరహాలో 90 లేదా 180 డిగ్రీల్లో ఆటోమేటిక్ గా తిరుగుతూ ఆకట్టుకొనే విధంగా ఫోటోలు, వీడియోలను రికార్డు చేయగలదు. కేవలం ఫోటోలు, వీడియోలు రికార్డింగ్ చేయడానికే పరిమితం కాకుండా రోబో తరహాలో ప్రవర్తిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మనుషులు లేదా వస్తువులు కదులుతున్నా సరే ఆటోమేటిక్ ట్రాకింగ్ ఫీచర్ సాయంతో ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేయగలదు. దీంతోపాటు ప్రశ్నలకు అవును లేదా కాదు అంటూ తల ఊపడం ద్వారా సమాధానం చెప్పగలదు.

దీంతోపాటు ఈ రోబోట్ ఫోన్ లో మరిన్ని ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. హానర్ మ్యాజిక్ V6 ఆధారంగా ఈ ఫోన్ ను రూపొందించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్ ను వినియోగించారు. దీంతోపాటు ఈ ఫోన్ సిలికాన్ కార్బన్ బ్లేట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉన్నా.. డిజైన్ మాత్రం చాలా సన్నగా ఉంటుంది.
హానర్ రోబోట్ ఫోన్ ఈ సంవత్సరం రెండో భాగంలో చైనాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ విడుదలపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








