విస్తరణ బాటలో Honor, రెండు సంవత్సరాల జర్నీలో ఎన్నో మైలురాళ్లు

|

హువావే ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టి దిగ్విజయంగా రెండు వసంతాలను పూర్తి చేసుకుంది.

విస్తరణ బాటలో  Honor, రెండు సంవత్సరాల జర్నీలో ఎన్నో మైలురాళ్లు

తన బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లో సుముచిత స్థానాన్ని దక్కించుకున్న హువావే, స్మార్ట్ కమ్యూనికేషన్ విభాగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. హానర్ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన Honor 6 Plus మొదలుకుని Honor 8 (ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు) వరకు సూపర్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో స్మార్ట్ మొబైలింగ్ విభాగాన్ని కొత్త లెవల్‌కు తీసుకువెళ్లాయి.

ఆధునిక అవసరాలకు అనుగుణంగా..

ఆధునిక అవసరాలకు అనుగుణంగా..

హువావే తన హానర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అక్టోబర్ 14, 2014లో Flipkart.com ద్వారా ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న హానర్ సిరీస్ ఫోన్‌లకు బెస్ట్ వాల్యూ ప్రైసింగ్‌ తోడవటంతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మరింతగా కనెక్ట్ అయ్యారు.

 

అనేక మైలురాళ్లను అందుకుంది

అనేక మైలురాళ్లను అందుకుంది

Honor బ్రాండ్ తన రెండు సంవత్సరాల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అందుకుంది. ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన హానర్ 6 ప్లస్, హానర్ 6, హానర్ 5సీ, హానర్ 4ఎక్స్ మోడల్స్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్‌గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రాబోతోన్నహానర్ 8 ఫోన్ డ్యుయల్ కెమెరా ఫీచర్‌తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోంది.

క్వాలిటీ, ఇన్నోవేషన్, బెస్ట్ వాల్యూ

క్వాలిటీ, ఇన్నోవేషన్, బెస్ట్ వాల్యూ

క్వాలిటీ, ఇన్నోవేషన్, బెస్ట్ వాల్యూ ప్రైసింగ్‌ వంటి అంశాలు హానర్ బ్రాండ్‌ను అత్యుత్తమంగా నిలబెట్టాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో హానర్ బ్రాండ్ ఫోన్‌లకు నాణ్యమైన గుర్తింపు ఉంది.

 

గ్లోబల్ నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్

గ్లోబల్ నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్

తన వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేసిన Huawei బెంగుళూరు కేంద్రంగా గ్లోబల్ నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్ (GNOC)ను నెలకొల్పబోతోంది.

'Make in India'కు మద్దతుగా..

'Make in India'కు మద్దతుగా..

మరోవైపు ప్రధానమంత్రి 'Make in India' కార్యక్రమానికి పూర్తి మద్దతను ప్రకటించిన Huawei తన హానర్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లోనే తయారు చేయబోతోంది.

 

గడిచిన రెండు సంవత్సరాల కాలంగా..

గడిచిన రెండు సంవత్సరాల కాలంగా..

గడిచిన రెండు సంవత్సరాల కాలంగా హువావే తన హానర్ బ్రాండ్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన Honor 5Cకి మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

200 సర్వీస్ సెంటర్లు..

200 సర్వీస్ సెంటర్లు..

తమ వినియోగదారులకు విశ్వసనీయమైన సేవలను అందించేందుక హువావే దేశవ్యాప్తంగా 200 సర్వీస్ సెంటర్లను నెలకొల్పింది. వీటిలో 30 ఎక్స్‌క్లూజివ్ హువావే సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి.

50,000 రిటైల్ అవుట్‌లెట్‌లలో..

50,000 రిటైల్ అవుట్‌లెట్‌లలో..

ఇదే సమయంలో తన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించుకునేందుకు హువావే కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్, ఈ ఏడాది చివరి నాటికి 50,000 రిటైల్ అవుట్‌లెట్‌లలో తమ ఫోన్‌లను అందుబాటులో ఉంచనుంది.

Best Mobiles in India

English summary
Honor Turns Two: Tracing the Journey to the Future. Read More in Telugu Gizbot...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X