పవర్‌పుల్ డిస్‌ప్లేతో హానర్ వి 10
చైనా దిగ్గజం హానర్ తన సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. అదిరిపోయే డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది.
చైనా దిగ్గజం హానర్ తన సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. అదిరిపోయే డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది. 18:9 యాస్పెక్ట్ రేషియోలో భారీ బెజిల్‌లెస్ స్క్రీన్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ నెల 28న భారీ అంచనాలతో ఇది విడుదల కానుంది.
అయితే ముందుగా ఈ నెల 5న లండన్‌లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అందరూ భావించినా అది జరగలేదు. దీని ధర సుమారు రూ.29 వేలు. ఈ మొబైల్ మన దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తోందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

స్పెసిఫికేషన్లు
ఆరు అంగుళాల తాకే తెర,
వెనుకవైపు 16 ఎంపీ కెమెరా, 20 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా,
6 జీబీ ర్యామ్, 64 జీబీ /128 జీబీ అంతర్గత మెమొరీ,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








