Just In
- 2 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 5 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- Sports
Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- News
Jr NTR: తారకరత్న ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా.. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్.. కుప్పంకు పయనం..!
- Movies
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Finance
Adani: తారుమారైన బిలియనీర్లు.. కిందకు పడిపోయిన అదానీ.. SEBI టార్గెట్ ఫిక్స్..!
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
తెలివితేటల్లో నేనే రారాజు అంటోన్న ‘Honor View 10’
మానవ మేధస్సుకు సవాల్ విసురితూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ, మనుషుల రోజువారి జీవితాల పై పెను ప్రభావం చూపుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మెచీన్లు దాదాపుగా అన్నిరకాల కమ్యూనికేషన్ విభాగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కార్టోనా వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి మంచి శుభారంభాన్ని అందించగా, సమీప భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న మరిన్ని ఫీచర్లు ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత క్రియాశీలకం చేయబోతున్నాయి.

స్మార్ట్ మొబిలిటీ ఇకో సిస్టం విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి రాచబాట వేస్తూ Honor బ్రాండ్ అందుబాటులోకి తీసుకువచ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 'Honor View 10’ విప్లవాత్మక ఫీచర్లతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. హై-రేంజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో పాటు ఖచ్చితమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సపోర్ట్ పై రన్ అయ్యే ఈ ఫోన్ రోజువారి స్మార్ట్‌ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లింది.

కైరిన్ 970 ఏఐ సీపీయూ
హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్‌కు కైరిన్ 970 ఏఐ సీపీయూ ప్రధానమైన బ్యాక్‌బోన్‌గా నిలుచింది. ఈ సాక్, ఫోన్‌ను మరింత తెలివిగా వ్యవహరించేలా చేస్తోంది. 100ఎన్ఎమ్ తయారీ ప్రాసెస్ పై బిల్ట్ చేయబడిన కిరిన్ 970 చిప్‌సెట్‌లో సింగిల్ స్క్వేర్ సెంటీమీటర్‌కు గాను 5.5 బిలియన్లు ట్రాన్సిస్టర్స్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు Huawei తెలిపింది. సరిగ్గా బొటని వేలు సైజులో ఉండే ఈ చిప్‌సెట్‌లో ఆక్టా-కోర్ సీపీయూ, 12-కోర్ జీపీయూ, డ్యుయల్ ఐఎస్‌పీ, ఏఐ కంప్యూటింగ్ ఆర్కిటెక్షర్‌లతో పాటు మోడ్రన్ మొబైల్ డివైస్‌కు అవసరమైన అనేక ఎలిమెంట్లను హానర్ నిక్షిప్తం చేసింది.
కిరిన్ 970 చిప్‌సెట్‌తో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ) కంబైన్ అయి ఉండటంతో మరింత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా హానర్ వ్యూ 10 రూపాంతరం చెందింది. ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యూ 10 ఫోన్‌లోని ఫోటోగ్రఫీ, మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ కన్సంప్షన్, గేమింగ్ తదితర విభాగాల పనితీరు పై ప్రత్యేకమైన శ్రద్థ తీసుకుంటుంది.

ఫాస్ట్, స్మూత్ ఇంకా సెక్యూర్ ..
కిరిన్ 970 చిప్‌సెట్ కారణంగా హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్‌లోని అన్ని విభాగాలు వేగవంతంగానూ ఇదే సమయంలో మరింత స్మూాత్‌గానూ స్పందించగలుగుతాయి. కిరిన్ 970 చిప్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఆక్టా-కోర్ సీపీయూ, క్వాడ్-కోర్ కార్టెక్స్-ఏ73 సీపీయూ క్లస్టర్ తో పోలిస్తే 50 రెట్ల వెగవంతంగా స్పందించగలుగుతుంది.
ఈ ఫోన్‌కు సంబంధించి ఇటీవల నిర్వహించిన ఓ బెంచ్ మార్కింగ్ టెస్ట్‌లో భాగంగా కైరిన్ 970 చిప్ నిమిషానికి 2000 ఫోటోలను ప్రాసెస్ చేయగలిగింది. ఈ స్పీడును మార్కెట్లోని మరే చిప్‌సెట్ అందుకోలేకపోయింది.

మునుపెన్నడూ చూడన విధంగా కెమెరా పనితీరు..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించగలిగే హానర్ వ్యూ 10 డ్యుయల్ కెమెరా యూనిట్, మొబైల్ ఫోటోగ్రఫీని కొత్తలెవల్‌కు తీసుకువెళ్లిందనే చెప్పాలి. ఈ కెమెరా పనితీరును రెట్టింపు స్థాయికి తీసుకువెళటంలో డెడికేటెడ్ ఎన్‌పీయూ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి. ఈ కెమెరా యూనిట్‌కు ఫుల్ సపోర్టివ్‌గా నిలిచే కిరిన్ 970 సాక్ నిమిషానికి ఏకంగా 2000 ఇమేజ్‌లను ప్రాసెస్ చేయగలదట. ఈ కెమెరాలోని కలర్స్, కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ ఇంకా ఎక్స్‌పోజర్‌లు అత్యుత్తమ పారామీటర్స్‌ను కలిగి ఉన్నాయి.
హానర్ వ్యూ 10 ఫోన్‌లో సెటప్ చేసిన డ్యుయల్ సెటప్, 20 మెగా పిక్సల్ మోనోక్రోమ్ లెన్స్ + 16 మెగా పిక్సల్ ఆర్‌జీబీ లెన్స్ కాంభినేషన్‌లో ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎక్విప్ కాబడిన ఈ డ్యుయల్ కెమెరా యూనిట్ షూటింగ్ కండిషన్స్ పై మరింత కంట్రోలింగ్‌ను కలిగి ఉంది.
మనం క్యాప్చుర్ చేయాలనుకునే విజువల్స్‌కు సంబంధించి బెస్ట్ అవుట్ పుట్‌ను రాబట్టే క్రమంలో హానర్ వ్యూ 10 ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌ను కవాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలును కల్పించారు. హానర్ వ్యూ 10తో క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలు నాణ్యమైన డిటెయిలింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ వెళుతురు కండీషన్స్‌లో కూడా ఈ కెమెరా పనితీరు అత్యుత్తమంగా ఉంది. ఇక మాక్రో ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి బెటర్ క్వాలిటీ ఫోటోగ్రఫీని హానర్ వ్యూ 10 అందిస్తోంది.

రియల్ టైమ్ డేటా ప్రాసెసింగి్..
హానర్ వ్యూ 10లో నిక్షిప్తంచేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌సెట్ డేటాను రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేయగలుగుతుంది. యూజర్ యూసేజ్ ప్యాట్రన్‌ను నమర్థవంతంగా అర్థం చేసుకోగలిగే ఈ ఏఐ బేసిడ్ మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ చిప్‌సెట్ పర్సనలైజుడ్ అలానే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు చేరువచేస్తుంది.

బెటర్ క్వాలిటీ గేమింగ్..
హానర్ వ్యూ 10లోని ఏఐ ఆధారిత స్మార్ట్ కంప్యూటింగ్ ఆర్కిటెక్షర్ గేమింగ్ విషయంలో రాజీపడలేని విధంగా తన పెర్ఫామెన్స్‌ను కనబరుస్తుంది. గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండల్ చేసే విధంగా ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Mali-G72 12- కోర్ జీపీయూ మునుపటి జనరేషన్ జీపీయూతో పోలిస్తే 20 రెట్ల క్వాలిటీతో గ్రాఫిక్ ప్రాసెసింగ్‌ను అందించగలుగుతుంది. ఇదే సమయంలో 50శాతం తక్కువ శక్తిని వినియోగించుకోగలుగుతుంది. హెవీ గ్రాఫికల్ కంటెంట్‌తో వచ్చే మూవీస్ లేదా 3జీ గేమ్స్‌ను ఈ డివైస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేయగలుగుతుంది.
హానర్ వ్యూ 10లో ఏర్పాటు చేసిన EMUI గేమ్ సూట్ ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తోంది. గేమ్ ప్లే అవుతోన్న సమయంలో ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే అంతరాయంలేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించే వీలంటుంది.
ఈ మోడ్ ఎనేబుల్ అయి ఉన్నపుడు ఫోన్ స్ర్కీన్ పై ఇన్‌కమ్మింగ్ కాల్స్, లో బ్యాటరీ, అలారమ్స్ వంటి ముఖ్యమైన నోటిఫికేషన్స్ మాత్రేమే డిస్‌ప్లే కాబడతాయి. ఈ స్మార్ట్ మోడ్ గేమింగ్ పెర్ఫామెన్స్‌ను ఇంప్రూవ్ చేయటంతో పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేయటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
మెరుగుపరచబడిన బ్యాటరీ పెర్ఫామెన్స్..
బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10 ఫోన్ నమ్మకమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3,750 mAh బ్యాటరీ, బ్యాకప్ పరంగా హెవీ యూసేజ్‌ను సైతం తట్టుకుని నిలబడగలుగుతుంది. ఇక కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10 ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోంది. ఈ రెండు సిమ్‌లు VoLTE ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. బ్లుటూత్, వై-ఫై, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, జీపీఎస్ వంటి కామన్ ఫీచర్లను ఈ ఫోన్‌లో చూడొచ్చు.
ఓవరాల్‌గా మంచి స్మార్ట్‌ఫోన్..
మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే బెస్ట్ ఓవరాల్ పెర్ఫామెన్స్‌ను హానర్ వ్యూ 10 కనబరుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధానమైన హైలైట్‌గా నిలిచింది. యూజర్ వ్యక్తిగత అవసరాలను పూరిస్తాయిలో అర్థంచేసుకోగలుగుతోన్న ఈ ఫోన్ కెమెరా, బ్యాటరీ, కంప్యూటింగ్ ఇంకా మల్టీటాస్కింగ్ విభాగాలను విభాగాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470