రూ.30,000లో బడ్జెట్‌లో పర్‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ : Honor View 10 రివ్యూ

  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ హానర్ బ్రాండ్ అభివృద్ధి చేసిన 'హానర్ వ్యూ 10’ స్మార్ట్‌ఫోన్, కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ 5టీ డివైస్‌కు ప్రధాన కాంపిటీటర్ భావిస్తోన్న హానర్ వ్యూ 10 మిడ్-రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనంలా అవతరించింది. Huawei సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కిరిన్ 970 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌సెట్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

  రూ.30,000లో బడ్జెట్‌లో పర్‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ : Honor View 10 రివ్య

   

  ఈ విప్లవాత్మక ప్రాసెసర్, హానర్ వ్యూ 10తగ పనితీరు పరంగా సరికొత్త లెవల్‌కు తీసుకువెళుతుందని Huawei చెబుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో బేక్ చేయబడిన ప్రాసెసర్, డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్, 8:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫీచర్లతో లాంచ్ అయిన Honor View 10 పూర్తి రివ్యూను ఇప్పుడు తెలుసుకుందాం..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఇంటెలిజెంట్ ఇంకా ఫ్యూచర్ ప్రూఫ్..

  హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్‌కు ‘కిరిన్ 971 ఏఐ సీపీయూ' ప్రధానమైన బ్యాక్‌బోన్ అని చెప్పుకోవచ్చు. హువావే బ్రాండ్ నుంచి సొంతంగా అభివృద్ధి చేయబడిన ఈ మొట్టమొదటి మొబైల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌‌ (ఎన్‌పీయూ)తో కంబైన్ అయి ఉండటంతో మరింత శక్తివంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌‌ అనేది ఫోటోగ్రఫీ, మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ కన్సంప్షన్, గేమింగ్ తదితర విభాగాల పనితీరు పై ప్రత్యేకమైన శ్రద్థ తీసుకుంటుంది.

  100ఎన్ఎమ్ తయారీ ప్రాసెస్ పై బిల్ట్ చేయబడిన కిరిన్ 970 చిప్‌సెట్‌లో సింగిల్ స్క్వేర్ సెంటీమీటర్‌కు గాను 5.5 బిలియన్లు ట్రాన్సిస్టర్స్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు Huawei తెలిపింది. సరిగ్గా బొటని వేలు సైజులో ఉండే ఈ చిప్‌సెట్‌లో ఆక్టా-కోర్ సీపీయూ, 12-కోర్ జీపీయూ, డ్యుయల్ ఐఎస్‌పీ, ఏఐ కంప్యూటింగ్ ఆర్కిటెక్షర్‌లతో పాటు మోడ్రన్ మొబైల్ డివైస్‌కు అవసరమైన అనేక ఎలిమెంట్లను హానర్ నిక్షిప్తం చేసింది.

  వేగవంతమైన పనితీరు...

  హానర్ వ్యూ 10 ఫోన్‌లో పొందుపరిచిన కిరిన్ 970 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌సెట్‌కు శక్తివంతమైన 6జీబి ర్యామ్ వ్యవస్థ తోడవటంతో ఆసాధారణ వేగంతో ఫోన్ ప్రాసెసింగ్ దూసుకుపోతోంది. ఈ ఫోన్‌లో యాప్ లోడింగ్ దగ్గర నుంచి బేసిక్ యూఐ నేవిగేషన్ వరకు అనేక రకాల రొటీన్ టాస్కులు రెప్పపాటులో జరిగిపోతన్నాయి. ఈ టాస్కులను నిర్వహిస్తోన్న సమయంలో పెర్ఫామెన్స్ స్లోడౌన్ అనేది ఎక్కడా మా దృష్టికి రాలేదు.

  ఇతర స్మార్ట్‌ఫోన్‌లలోని డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో పోలిస్తే తమ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌ 300 రెట్ల వేగంతో స్పందించగలుగుతుందని హానర్ బల్లగుద్ది చెబుతోంది. మల్టీటాస్కింగ్ విషయానికి వచ్చేసరికి గూగుల్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లకు ధీటుగా హానర్ వ్యూ 10 స్పందిస్తోంది.

  కిరిన్ 970 ఏఐ సీపీయూ vs స్నాప్‌‌డ్రాగన్ 835 సీపీయూ

  హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్‌లో బిల్ట్ చేసిన కిరిన్ 970 ఏఐ చిప్‌సెట్‌ను ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలోని స్నాప్‌డ్రాగన్ 835 సీపీయూతో కంపేర్ చేసి చూడగా అనేక ఆసక్తికవర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మా పరిశీలనలో భాగంగా హానర్ వ్యూ 10 ఫోన్‌ను వన్‌ప్లస్‌5టీ, ఎల్‌జీ వీ30ప్లస్, గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ వంటి శక్తివంతమైన డివైస్‌లతో పోల్చి చూడటం జరిగింది.

  ఈ నాలుగు డివైస్‌లను పక్కపక్కన పెట్టి చూసినట్లయితే, యాప్ రెస్పాన్స్ టైమ్ దగ్గర నుంచి వెబ్‌‌పేజ్ లోడింగ్ వరకు అంతా ఒకేలా ఉంది. అయితే మెమురీ మేనేజ్‌మెంట్ పరంగా మాత్రం వన్‌ప్లస్ 5టీ విజేతగా నిలిచింది.

  యాప్స్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 5టీ, ఎల్‌జీ వీ30ప్లస్, గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ డివైస్‌లతో పోలిస్తే హానర్ వీ10లో యాప్స్ రెస్పాన్స్ టైమ్ వేగంగా ఉంది. కిరిన్ 970 చిప్‌‍సెట్‌లో పొందుపరిచిన క్లౌడ్ ఆధారిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్సులు, ఎడిటింగ్ ఎఫెక్ట్స్ విషయంలో గర్వించదగ్గ మార్పులను తీసుకువచ్చింది.

  ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే విధమైన ఇమేజ్‌ను ఓపెన్ చేసి, ఒకే విధమైన ఫిల్టర్స్‌ను అప్లై చేసి చూడగా రెస్పాన్స్ టైమ్ అనేది మిగిలిన ఫోన్‌లతో పోలిస్తే హానర్ వ్యూ 10 ఫోన్ లో అసాధారణ వేగంతో ఉంది.

  వన్‌ప్లస్ 5టీతో పోటాపోటీగా గేమింగ్ రెస్పాన్స్ టైమ్...

  హానర్ వ్యూ 10 ఆఫర్ చేసే గేమ్ రెస్పాన్ టైమ్‌ను వన్‌ప్లస్ 5టీ ఆఫర్ చేసే గేమ్ రెస్పాన్స్ టైమ్‌తో కంపేర్ చేసి చూడగా ఇంచుమించుగా సమానమైన ఫలితాలు నమోదయ్యాయి. Injustice 2, Asphalt 8 వంటి గేమ్స్, వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్‌లో వేగవంతంగా లోడ్ అయినప్పటికి రన్నింగ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌‍ఫోన్‌లు ఒకే విధంగా స్పందించగలిగాయి. గేమ్ ఆడుతోన్న సమయంలో ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్‌ను ఈ రెండు ఫోన్‌లలో గుర్తించలేదు.

  హానర్ వ్యూ 10లో ఏర్పాటు చేసిన EMUI గేమ్ సూట్ ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తోంది. గేమ్ ప్లే అవుతోన్న సమయంలో ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే అంతరాయంలేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించే వీలంటుంది. ఈ మోడ్ ఎనేబుల్ అయి ఉన్నపుడు ఫోన్ స్ర్కీన్ పై ఇన్‌కమ్మింగ్ కాల్స్, లో బ్యాటరీ, అలారమ్స్ వంటి ముఖ్యమైన నోటిఫికేషన్స్ మాత్రేమే డిస్‌ప్లే కాబడతాయి. ఈ స్మార్ట్ మోడ్ గేమింగ్ పెర్ఫామెన్స్‌ను ఇంప్రూవ్ చేయటంతో పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేయటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

  హానర్ వ్యూ 10 కెమెరా పనితీరు..

  డ్యుయల్ లెన్స్ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందించటం హానర్ బ్రాండ్‌కు కొత్తేమి కాదు. ఇప్పటికే అనేక డ్యుయల్ కెమెరా సెటాప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన హువావే, తాజా తన హానర్ వ్యూ 10తో మరో ప్రయోగానికి తెరలేపినట్లయ్యింది.

  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించగలిగే హానర్ వ్యూ 10 డ్యుయల్ కెమెరా యూనిట్, పనితీరు పరంగా సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది. ఈ కెమెరా పనితీరును రెట్టింపు స్థాయికి తీసుకువెళటంలో డెడికేటెడ్ ఎన్‌పీ‌‌‌యూ విజయవంతమైందనే చెప్పుకోవాలి. ఈ కెమెరా యూనిట్‌కు ఫుల్ సపోర్టివ్‌గా నిలిచే కిరిన్ 970 సాక్ నిమిషానికి ఏకంగా 2000 ఇమేజ్‌లను ప్రాసెస్ చేయగలదట.

  ఆ స్టోరీలను వాట్సాప్ స్టోరీలుగా పెట్టుకోవచ్చట!

  ఆకట్టుకునే ఫోకసింగ్ స్పీడ్...

  ఫోకసింగ్ స్పీడ్ పరంగా హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌‍జీ వీ30+, వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌లతో కంపేర్ చేసి చూడగా ఎటువంటి తేడాలు నోటిఫై కాలేదు. అయితే, ఇమేజ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా వ్యత్యాసాలే కినిపించాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఒకే విధమైన ఇమేజ్‌ను క్యాప్చుర్ చేసి చూడగా రకరకాల అవుట్‌పుట్స్ నమోదయ్యాయి.

  ఎల్‌జీ, హానర్ ఫోన్‌లతో క్యాప్చుర్ చేసిన ఇమేజ్‌లతో పోలిస్తే వన్‌ప్లస్ 5టీ కెమెరాతో క్యాప్చుర్ చేసిన సీన్‌లో గరిష్ట శబ్దంతో పాటు తక్కువ వివరాలు నమోదయ్యాయి. ఈ మూడు ఫోటోలను 100 శాతానికి మ్యాగ్జిమైజ్ చేసి చూడగా వన్‌ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డిటెయిలింగ్ పూర్తిగా దెబ్బతింది. ఇదే సమయంలో ఎల్‌జీ వీ30+ స్మార్ట్‌ఫోన్‌లో డిటెయిలింగ్ కొద్దిగా దెబ్బతింది. హానర్ వ్యూ 10తో క్యాప్చుర్ చేసిన ఇమేజ్ క్వాలిటీకి సంబంధించి డిటెయిలింగ్ మాత్రం అటుఇటుగా కాకుండా మధ్యరకంగా ఉంది.

  కెమెరా సెట్టింగ్స్‌ను కవాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలు..

  హానర్ వ్యూ 10 ఫోన్‌లో సెటప్ చేసిన డ్యుయల్ సెటప్, 20 మెగా పిక్సల్ మోనోక్రోమ్ లెన్స్ + 16 మెగా పిక్సల్ ఆర్‌జీబీ లెన్స్ కాంభినేషన్‌లో ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎక్విప్ కాబడిన ఈ డ్యుయల్ కెమెరా యూనిట్ షూటింగ్ కండిషన్స్ పై మరింత కంట్రోలింగ్‌ను కలిగి ఉంది.

  మనం క్యాప్చుర్ చేయాలనుకునే విజువల్స్‌కు సంబంధించి బెస్ట్ అవుట్ పుట్‌ను రాబట్టే క్రమంలో హానర్ వ్యూ 10 ఫోన్‌ కెమెరా సెట్టింగ్స్‌ను కవాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలును కల్పించారు. హానర్ వ్యూ 10తో క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలు నాణ్యమైన డిటెయిలింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ వెళుతురు కండీషన్స్‌లో కూడా ఈ కెమెరా పనితీరు అత్యుత్తమంగా ఉంది. ఇక మాక్రో ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 5టీ కంటే చాలా రెట్ల బెటర్ క్వాలిటీ ఫోటోగ్రఫీని హానర్ వ్యూ 10 అందిస్తోంది.

  నాణ్యమైన డిటెయిలింగ్, ఖచ్చితమైన కలర్ క్వాలిటీ..

  bokeh ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10 ప్రొడ్యూస్ చేస్తోన్న బోకెహ్ షాట్స్ ఖచ్చితమైన కలర్ క్వాలిటీతో పాటు నాణ్యమైన డిటెయిలింగ్‌ను అందిస్తున్నాయి. ఈ ఫోన్ కెమెరాతో క్యాప్చుర్ చేసిన బోకేహ్ షాట్స్, వన్‌ప్లస్ 5టీతో క్యాప్చుర్ చేసిన బోకేహ్ షాట్స్ కంటే అత్యుత్తమంగా ఉండటం విశేషం.

  ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10లో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్ మోడ్, మోనోక్రోమ్ మోడ్, నైట్ మోడ్, ప్రో మోడ్ వంటి ఫీచర్లు కెమెరా యాప్‌ను ఫీచర్ రిచ్ యాప్‌గా నిలబెట్టాయి. ఫోన్ ముందు భాగంలో సెటప్ చేసిన 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియోలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

  మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే..?

  హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. 18:9 యాస్పెక్ట్ రేషియో ఈ డిస్‌ప్లేకు మరో హైలైట్‌గా నిలిచింది. ఈ పెద్ద డిస్‌ప్లే కంఫర్టబల్ వ్యూవింగ్‌కు మరింత అనుకూలంగా ఉంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తోన్న విజువల్స్ అవుట్ డోర్ కండీషన్స్‌లో సైతం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శనను కనబరుస్తోంది.

  లుక్ ఇంకా ఫీల్ పరంగా...

  లుక్ ఇంకా ఫీల్ పరంగా హానర్ వ్యూ 10 పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటోంది. మెటల్ ఇంకా గ్లాస్ బాడీతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ మొదటి లుక్‌లోనే రూ.50,000 ప్రీమియమ్ రేంజ్ఫో న్‌ను తలపిస్తుంది. తక్కువ బరువుతో పాటు స్లిమ్ నేచర్‌ను కలిగి ఉండటం కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ చేతుల్లో జారుతోన్న ఫీలింగ్‌ను కలిగిస్తోంది.

  హానర్ వ్యూ 10 ఫోన్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను హోమ్ బటన్ భాగంలో నిక్షిప్తం చేయటం జరిగింది. పవర్ బటన్స్ అలానే వాల్యుమ్ రాకర్స్ ఫోన్ కుడిచేతి భాగంలో, హైబ్రీడ్ సిమ్ ట్రే ఎడమ చేతి వైపు భాగంలో ఏర్పాటు చేసారు. ఫోన్ పై భాగంలో మైక్రోఫోన్తో పాటు ఛార్జింగ్ పోర్టులను పొందుపరిచారు. క్రింది భాగంలో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను పొజీషన్ చేయటం జరిగింది.

  ఫీచర్ రిచ్ యూజర్ ఇంటర్‌ఫేస్

  హానర్ వ్యూ 10 ఫోన్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా రిచ్ గానూ, ఇదే సమయంలో యూజర్ ఫ్రెండ్లీగానూ అనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ది చేసిన EMUI 8.0 కస్టమైజిడ్ స్కిన్ అనేక ఉపయోగకర ఫీచర్లతో ఎటువంటి కన్ఫ్యూజన్‌కు గురి చేయకుండా జాయిగా ఫోన్ ను ముందుకు నడిపిస్తుంది.

  బ్యాటరీ పనితీరు ఇంకా కనెక్టువిటీ...

  బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10 ఫోన్ నమ్మకమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3,750 mAh బ్యాటరీ, బ్యాకప్ పరంగా హెవీ యూసేజ్‌ను సైతం తట్టుకుని నిలబడగలుగుతుంది. ఇక కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి హానర్ వ్యూ 10 ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోంది. ఈ రెండు సిమ్‌లు VoLTE ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. బ్లుటూత్, వై-ఫై, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, జీపీఎస్ వంటి కామన్ ఫీచర్లను ఈ ఫోన్‌లో చూడొచ్చు.

  చివరి మాటలు..

  ప్రధానంగా రూ.30,000 ధర సెగ్మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేయబడిన హానర్ వ్యూ 10 ఫోన్ ను తెలివైన డివైస్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫీచర ప్యాకుడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కిరిన్ 970 చిప్‌సెట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్, డెడికేటెడ్ ఎన్‌పీయూ వంటి ఫీచర్లు మరింత పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దాయి. పనితీరు పరంగా హానర్ వ్యూ 10 ఫోన్ లో ఏదైనా నిరుత్సాహపరించే విషయం ఉందంటే అది డిస్ ప్లే విభాగంలోనే, హానర్ వ్యూ 10 లో పొందుపరిచిన ఎల్ సీడీ ప్యానల్ AMOLED, OLED ప్యానల్స్ తరహాలో వైబ్రెంట్ కలర్స్‌ను ఆఫర్ చేయలేకపోతోంది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Honor View 10 is priced at Rs. The smartphone sports a taller 18:9 aspect ratio display. The smartphone features a 5.99-inch FHD+ screen that delivers a resolution of 2160x1080p pixels. It also has a capable dual-lens camera setup
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more