Honor View 10 vs OnePlus 5T : మీ డబ్బుకు న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ ఏది ?

By Hazarath
|

మిడ్‌రేంజ్ ఫోన్లలో ఇప్పుడు తలపడుతున్న కంపెనీల్లో ప్రధానంగా హువాయి, వన్‌ప్లస్ కంపెనీలనే ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆపిల్, శాంసంగ్ లాంటి కంపెనీల ఫోన్ ఫీచర్లకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కంపెనీలు తమ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. కాగా ఈ రెండు కంపెనీల నుంచి గతేడాది తలపడిన ఫోన్లు ఏవైనా ఉన్నాయంటే అవి హానర్ వ్యూ 10, అలాగే వన్‌ప్లస్ 5టీలనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు హ్యాండ్‌సెట్లు అదిరిపోయే హార్డ్‌వేర్‌తో పాటు, డ్యూయెల్ లెన్స్ కెమెరాతో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. కాగా వన్‌ప్లస్ 5టీ ధర రూ. 32,999, అలాగే హానర్ వ్యూ 10 ధర రూ. 29,999..అయితే రెండు ఫోన్లలో ఫీచర్లు ఎలా ఉన్నాయన్న దాన్ని విశ్లేషిద్దాం.

 

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీతో Smartron t phone P, మీ కోసం బడ్జెట్ ధరలో !అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీతో Smartron t phone P, మీ కోసం బడ్జెట్ ధరలో !

హానర్ వ్యూ 10 స్పెషిఫికేషన్స్

హానర్ వ్యూ 10 స్పెషిఫికేషన్స్

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వన్‌ప్లస్ 5టీ స్పెషిఫికేషన్స్

వన్‌ప్లస్ 5టీ స్పెషిఫికేషన్స్

6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

డిజైన్ డిస్‌ప్లే
 

డిజైన్ డిస్‌ప్లే

రెండు ఫోన్లు ఈ స్పెషిఫికేషన్లలో దేనికదే సాటి అని చెప్పుకోవాలి. OnePlus 5T కర్వ్డ్ బాక్ ప్యానల్‌తో రాగా, Honor View 10 ఫ్లాట్ రేర్ ప్యానల్‌తో వచ్చింది. అయితే వన్ ప్లస్ 5టీలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఒక చేత్తోనే హ్యండిల్ చేయవచ్చు. హానర్ వ్యూ 10లో రెండు చేతుల ఉపయోగించాలి.
రెండు ఫోన్లు పుల్ HD+ displaysతో 18:9 aspect ratioతో మార్కెట్లోకి దూసుకొచ్చాయి. అయితే Honor View 10లో 5.99 ఇంచ్ LCD screenతో రాగా OnePlus 5T మాత్రం 6.01 AMOLED displayతో దూసుకొచ్చింది.

హార్డ్‌వేర్

హార్డ్‌వేర్

ఈ విషయంలో హానర్ వ్యూ 10దే హవా అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో లేటెస్ట్ Kirin 970 AI Chipsetను పొందుపరిచారు. దీని ద్వారా అన్ని పనులు చాలా వేగవంతంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా OnePlus 5Tలో Snapdragon 835 CPUని పొందుపరిచారు.
ర్యామ్ విషయానికొస్తే రెండు ఫోన్లు 6జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి వచ్చాయి. కాగా హానర్ వ్యూలో మెమొరీ ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ గా ఉంటుంది.

కెమెరా

కెమెరా

హానర్ వ్యూ 10 20 ఎంపీ monochrome lensతో పాటు 16MP RGB lensతో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా షూట్ సమయంలో మీరు కెమెరాను పూర్తిగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 5టీ కూడా అదే ఫీచర్లతో అదే రేంజ్ లో వచ్చినప్పటికీ ఆ ఫోన్‌తో సరితూగడం కొంచెం కష్టమైన పనే.

Software

Software

ఈ విషయంలో రెండు ఫోన్లు దేనికవే సాటి అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 8.0 ఓరియోతో రెండు ఫోన్లు ఆపరేట్ అవుతాయి. అయితే Honor View 10లో హువాయి EMUI 8.0ని పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ ఓ సరికొత్త అనుభూతిని పొందే అవకాశం హానర్ కల్పిస్తోంది.

Battery and Connectivity

Battery and Connectivity

ఈ విషయంలో Honor View 10ను కాస్త బెటర్ గా చెప్పుకోవచ్చు. OnePlus 5T 3,300 mAh batteryతో రాగా Honor View 10 మాత్రం 3750 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. అలాగే హానర్ ఫోన్ నాలుగు సిమ్ కార్డులను సపోర్ట్ చేస్తుంది.

…and the Winner is

…and the Winner is

రెండింటి ఫోన్ల ఫీచర్లను పోల్చి చూస్తే Honor View 10 కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ధర కూడా OnePlus 5T కన్నా కొంచెం తక్కువ గానే ఉంది.

Best Mobiles in India

English summary
Honor View 10 vs OnePlus 5T: Which offers better value for your money More News at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X