మొబైల్ మార్కెట్లో సంచలనం, హానర్ వ్యూ 20 29న వస్తోంది

|

ఇండియాలో మొబైల్ మార్కెట్ రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ సరికొత్త ఫీచర్లతో ఇండియా మార్కెట్లోకి తమ స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీలు అయితే ఈ విషయంలో మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాయి. షియోమి, ఒప్పో, హానర్, వన్ ప్లస్ లాంటి కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీపుకువచ్చి భారీ అభాలను ఆర్జిస్తున్నాయి. ఇందులో భాగంగా హువాయి సబ్ బ్రాండ్ హానర్ కూడా తన వ్యూ 20ని ఈ నెల 29న ఇండియాకి తీసుకొస్తోంది. ఈ ఫోన్లో ఫీచర్లు కొత్త టెక్నాలజీతో యూజర్లన అలరిస్తున్నాయి. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

హానర్‌ వ్యూ20 ఫీచర్లు
 

హానర్‌ వ్యూ20 ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువాయి కైరిన్ 980 ఆక్టాకోర్‌ సాక్‌ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ధర

ధర

హాన‌ర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఖ‌రీదు రూ.46,070 ఉండ‌గా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.52,550గా ఉంది.

ఇండియాకి ఎప్పుడు ?

ఇండియాకి ఎప్పుడు ?

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్‌ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 22న లాంచ్‌ చేసింది. ఈ నెల 29న భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. కాగా ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌కు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది.

డిస్ ప్లే, మెటల్ గ్లాస్ బాడీ
 

డిస్ ప్లే, మెటల్ గ్లాస్ బాడీ

ఈ ఫోన్ లో డిస్ ప్లే దుమ్మురేపేలా డిజైన్ చేశారు. వీడియోలు చూస్తున్నప్పుడు కాని అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు కాని మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ప్రపంచంలోనే ఫస్ట్ ఆల్ స్క్రీన్ డిజైన్ ని ఈ ఫోన్లో పొందుపరిచారు. ఇంతకు ముందు ఏ ఫోన్ లో ఈ ఫీచర్ రాలేదు. ఫ్రంట్ కెమెరా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 18 టెక్నాలజీ లేయర్లను ఈ ఫోన్ కోసం వాడారు.

కెమెరాల పనితీరు

కెమెరాల పనితీరు

ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్‌గా, వ్యూ సిరీస్‌లో టాప్ ఎండ్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వ్యూ20 నిలవనుంది. ఈ ఫోన్ తో ఫోటోలు తీస్తే మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఫోటోలు తీసినట్లే ఉంటుందని కంపెనీ తెలిపింది. 60 కేటగిరీల్లోని కదలికలను ఈ ఫోన్ పట్టుకోగలదు. రియల టైంలో 1500 సెన్సారియోస్ దీని ప్రత్యేకత. సూపర్ స్లో మోషన్ లో వీడియోలను షూట్ చేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే DSLr వర్సెస్ హానర్ వ్యూ 20గా చెప్పవచ్చు.ఈ ఫోన్ వెనుక భాగంలో 48, 12 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3డీ సెకండ‌రీ రియ‌ర్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో గేమ్స్ ఆడుకునేట‌ప్పుడు 3డీ జెస్చ‌ర్‌ల‌ను వాడుకోవ‌చ్చు.

హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్

హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్

ఈ డివైస్ ఈ రెండు విభాగాల్లో దుమ్మురేపే కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. world's first 7nm mobile AI chipset- Kirin 980 AI processorని ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ద్వారా ఫోన్ అమితవేగంతో పనిచేస్తుంది. అలాగే పవర్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. అలాగే లేటెస్ట్ వర్సన్ Android 9.0 + Magic UI2.0.1 మీద రావడంతో పనితీరు చాలా స్మార్ట్ గా ఉంటుంది. isplay, battery, UI, camera, etc. Some useful software features provided by Magic UI 2.0.1 includes; Eye comfort mode, App twin, Battery saving modes, Storage cleaner, Digital balance, GPU Turbo 2.0 వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

బ్యాటరీ పనితీరు

బ్యాటరీ పనితీరు

ఈ ఫోన్కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఇందులో అమ‌ర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. గేమ్స్ ఆడుకునే సమయంలో ఈ ఫోన్ బ్యాటరీని కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. కంపెనీ దీంతో పాటుగా చైనాలో హానర్‌ వ్యూ 20 మోషినో రెడ్‌ ఎడిషన్‌ను లేటెస్ట్ గా విడుదల చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Honor View 20: Smartphone with the most number of industry-first technologies More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X