Honor కంపెనీ నుంచి మ‌రో మిడ్ రేంజ్ SmartPhone విడుద‌ల‌!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ SmartPhone కంపెనీ హాన‌ర్ నుంచి మ‌రో మిడ్ రేంజ్ ఫోన్ విడుద‌లైంది. Honor X40i పేరుతో స‌రికొత్త మోడ‌ల్‌ను హోం మార్కెట్ చైనాలో విడుద‌ల చేసింది. ఈ కంపెనీ నుంచి గ‌తేడాది విడుద‌లైన Honor X30i కి స‌క్సెస‌ర్‌గా ఈ మోడ‌ల్ తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ SmartPhone భార‌త్‌లో కూడా విడుద‌ల కానున్న‌ట్లు రూమ‌ర్లు వస్తున్నాయి. ఈ Honor X40i కెమెరా ప‌రంగా, బ్యాట‌రీ ప‌రంగా అప్‌గ్రేడ్ ఫీచ‌ర్‌ల‌తో వ‌స్తోంది. ఈ మొబైల్‌ 40వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ తో అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు స్పెసిఫికేష‌న్ల గురించి తెలుసుకుందాం.

Honor X40i

Honor X40i ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 19.9:9 aspect ratio ప‌ని చేస్తుంది. ఇది octa-core MediaTek Dimensity 700 ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఇది హోల్ పంచ్ డిస్‌ప్లే తో వ‌స్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. 8GB ర్యామ్‌+ 128GB, 8GB ర్యామ్‌ + 256GB, 12GB ర్యామ్ + 256GB ఇంట‌ర్నల్ స్టోరేజీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో వ‌స్తోంది.

Honor X40i

ఇక కెమెరాల విష‌యానికి వ‌స్తే మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 40 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

Honor X40i

Honor X40i ధ‌ర‌:
చైనా మార్కెట్లో ఈ Honor X40i మోడ‌ల్ 8GB of RAM|128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర 1,599 యువాన్ల‌కు అందుబాటులో ఉంది. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం సుమారు రూ.19వేల‌కు పైనే ఉండొచ్చ‌ని విశ్లేష‌కుల అంచ‌నా. 8GB of RAM|256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.21,300, ఇక 12GB of RAM|256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.23,700 కు అందుబాటులోకి రావొచ్చ‌ని స‌మాచారం. వివిధ క‌ల‌ర్ల‌లో ఇవి చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజ్‌, సిల్వ‌ర్, గ్రీన్‌, బ్లాక్ క‌ల‌ర్ల‌లో ఇవి కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

ఇప్ప‌టికే విడుదలైన‌ Honor X30i ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఇది MediaTek MT6833P Dimensity 810 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. 6GB ర్యామ్‌, 8GB ర్యామ్ కెపాసిటీల‌తో రెండు వేరియంట్ల‌లో వ‌స్తోంది.

ఇక కెమెరాల విష‌యానికి వ‌స్తే మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 48 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 22.5 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Honor X40i With Dimensity 700 SoC, 50MP Cameras Launched; Specs & Pricing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X