Home
Mobile

108MP కెమెరా, 16GB RAM తో Honor కొత్త ఫోన్ లాంచ్! ధర, స్పెసిఫికేషన్లు

హానర్ సంస్థ నుంచి Honor X50 GT గురువారం, జనవరి 4న చైనాలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మరియు 35W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది మరియు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 16GB వరకు RAM మరియు 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీ కు మద్దతు ఇస్తుంది. ఇది నాలుగు RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ వేరియంట్ లలో సేల్ కు రాబోతోంది. మరియు ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌ల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ పై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Honor X50 GT With 108MP Camera,16GB RAM And Snapdragon 8+ Gen 1 Chipset Launched. Price,Specifications And Sale

Honor X50 GT ధర, లభ్యత వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్ ఫాంటసీ నైట్ బ్లాక్ మరియు సిల్వర్ వింగ్ గాడ్ ఆఫ్ వార్ (చైనీస్ నుండి అనువదించబడింది) రంగు ఎంపికలలో అందించబడింది. చైనా మార్కెట్లో ఈ Honor X50 GT స్మార్ట్ ఫోన్ ధర దాని 12GB + 256GB వేరియంట్ కోసం CNY 2,199 (సుమారు రూ. 25,600) నుండి ప్రారంభమవుతుంది.

ఈ ఫోన్ 16GB + 256GB, 16GB + 512GB మరియు 16GB + 1TB కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంది, వీటి ధరలు వరుసగా CNY 2,399 (దాదాపు రూ. 27,900), CNY 2,599 (దాదాపు రూ. 30,200 ) మరియు CNY 2,899 (దాదాపు రూ. 33,700) గా ఉన్నాయి.

Honor X50 GT ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉంది మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 9 నుండి దేశంలో సేల్ చేయబడుతుంది. లాంచ్ ఆఫర్ కింద సంస్థ CNY 200 (దాదాపు రూ. 2,300) పరిమిత-సమయ తగ్గింపును కూడా అందిస్తోంది.

Honor X50 GT స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
కొత్తగా లాంచ్ చేయబడిన ఈ హానర్ హ్యాండ్‌సెట్‌లో 6.78-అంగుళాల 1.5K (2,652 x 1,200 పిక్సెల్‌లు) వక్ర OLED ప్యానెల్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, PWM డిమ్మింగ్ రేట్ 1,920Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 1,000Hz, గరిష్ట స్థాయి 1200Hz nits తో HDR10 మద్దతు కలిగి ఉంటుంది.

హానర్ X50 GT ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా అడ్రినో 730 GPUతో జత చేయబడింది. గరిష్టంగా 16GB RAM మరియు 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ OS 7.2 తో ఈ ఫోన్ వస్తుంది.

ఇక కెమెరా వివరాలు గమనిస్తే, హానర్ X50 GT 108-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HM6 ప్రైమరీ సెన్సార్ మరియు వెనుకవైపు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో అమర్చబడి ఉంది. ముందు సెల్ఫీ కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్‌తో కలిసి ఉంటుంది.

USB టైప్-C పోర్ట్ ద్వారా 35W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో X50 GT లో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ నానో సిమ్-సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.1 మరియు GPS కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. భద్రత కోసం, ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 192గ్రా మరియు పరిమాణం 163.6mm x 75.5mm x 7.98mm కొలతల డిజైన్ కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor X50 GT With 108MP Camera,16GB RAM And Snapdragon 8+ Gen 1 Chipset Launched. Price,Specifications And Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X