108MP కెమెరా, 5800mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ విడుదల.. మెరుగైన ప్రాసెసర్ సహా..!!
హానర్ సంస్థ కొన్ని నెలల క్రితం హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్‌కు ఇప్పటికి మంచి స్పందన వస్తోందని తెలుస్తోంది. అయితే తాజాగా మరో కొత్త హ్యాండ్‌సెట్‌ను హానర్ విడుదల చేసింది. హానర్ X50 ప్రో (Honor X50 Pro) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
హానర్ X50 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్OS 7.2 ఆధారంగా పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ ఫోన్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుందని తెలుస్తోంది.

హానర్ X50 ప్రో 5G డిస్‌ప్లే : హానర్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 10 బిట్ స్క్రీన్ వంటి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీతో విడుదల అయింది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే వీలుంది.
108MP ప్రధాన కెమెరా : హానర్ X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో నాణ్యమైన ఫొటోగ్రఫీ సొంతమని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ను కలిగి ఉంది.

5800mAh బ్యాటరీ సామర్థ్యం : మెరుగైన కెమెరాలతో పాటు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ప్యాక్ ఈ హానర్ కొత్త హ్యాండ్‌సెట్ సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ NFC, USB-C పోర్టు, వైఫై, GPS వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది.
ఈ హానర్ X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో గ్రీన్, బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర 2799 యువాన్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.33,642గా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్‌గా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే సమాచారాన్ని హానర్ వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








