మెరుగైన డ్రాప్ రెసిస్టెన్స్, 50MP AI కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్.. మరో మూడు రోజుల్లో విడుదల..!
Honor X7c 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హానర్ నుంచి జులై నెలలో హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరా, 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లే, 6600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
ఎప్పుడు విడుదల కానుంది? :
త్వరలో హానర్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. హానర్ X7c 5G పేరుతో లాంచ్ కానుంది. హానర్ సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ ఆగస్టు 18 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హానర్ ఫోన్ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంది.

ప్రీమియం సర్టిఫికేషన్ :
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ అమెజాన్‌లో లైవ్‌లో ఉంది. దీని ఆధారంగా IP64 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు SGS ప్రీమియం సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు MagicOS 8.0 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP AI కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రానుంది.
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ వైట్, పారెస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ ధరపై కచ్చితమైన వివరాలు తెలియలేదు. అయితే ఈ ఫోన్ రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
* హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ :
ఇటీవల విడుదల అయిన హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP65M డస్ట్ మరియు 360 డిగ్రీ వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తోంది. మరియు అనేక AI ఫీచర్లున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 3x జూమ్‌తో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 5MP వైడ్ యాంగిల్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








