ఫుల్ HD+ డిస్‌ప్లే, కిందపడినా డ్యామేజీ కానీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 5G ఫోన్‌పై డిస్కౌంట్!
భారత్ మార్కెట్ లో ప్రస్తుతం బడ్జెట్ రేంజ్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే హానర్ సంస్థ భారత్ లో హానర్ X7x 5G స్మార్ట్‌ఫోన్ ను (Honor X7c 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్, ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతోపాటు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ దీపావళి సేల్‌లో భాగంగా :
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ లో (Amazon Great Indian Diwali Special Sale 2025) భాగంగా రూ.13998 ధరకు అందుబాటులో ఉంది.

బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ :
అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.1000 డిస్కౌంట్ ను పొందింది. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా మరింత తగ్గింపు ధరకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, మూన్‌లైట్ వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
డ్రాప్ రెసిస్టెన్స్ :
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD+ TFT LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. ఫలితంగా ఈ ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది.

స్నాప్‌డ్రాగన్ :
ఈ హానర్ హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 613 GPU ను కూడా అమర్చి ఉంది. అయితే ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తోంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ LED ఫ్లాట్ లైట్ ను కూడా అమర్చి ఉంటుంది.
ఈ హానర్ ఫోన్ 33W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్, WiFi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








