బడ్జెట్ ధరలో 50MP కెమెరా, 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Honor X7c 5G Smartphone Sale : హానర్ సంస్థ భారత్ మార్కెట్ లో గత నెలలో హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 108MP కెమెరా, 6600mAh బ్యాటరీని కలిగి ఉంది. 256GB స్టోరేజీ, SGS డ్రాప్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. అయితే తాజాగా హానర్ నుంచి బడ్జెట్ రేంజ్ లో హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ సేల్ :
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఆగస్టు 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6 నెలల వరకు నోకాస్ట్ EMI ఆఫర్ ను కూడా అందిస్తోంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ( మొబైల్ ప్లాట్‌ఫాం ) ను కలిగి ఉంది. Adreno 613 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది.
5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ :
హానర్ X7c 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో FHD+ TFT LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ రేటింగ్ ను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున కింద పడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది.
50MP కెమెరా, 5200mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 33W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.
హానర్ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.0, WiFi 802.11ac, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఫారెస్ట్ గ్రీన్, మూన్‌లైట్ వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 5MP వైడ్ యాంగిల్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 6.78 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తోంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








