Home
Mobile

రూ.14999 ధరకు 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

Honor X7c 5G smartphone Launched : హానర్‌ X7c 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ ఫోన్ బడ్జెట్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి వచ్చింది. భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 5 స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌తో లాంచ్‌ అయింది. ఫలితంగా పొరపాటున కింద పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు బడ్జెట్ ధరలో భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. రెండు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ హానర్‌ స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

హానర్‌ X7c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
హానర్‌ X7c 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల ఫుల్‌ HD+ TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 850 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. 5 స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ తో అందుబాటులో ఉంది. ఫారెస్ట్ గ్రీన్‌, మూన్‌లైట్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Honor X7c 5G smartphone telugu news

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ (మొబైల్‌ ప్లాట్‌ఫాం) పైన పనిచేస్తుంది. దీంతోపాటు Adreno 613 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌ తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌ తో 2MP డెప్త్‌ సెన్సార్‌, LED ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.2 అపేచర్‌ తో 5MP కెమెరాను అమర్చి ఉంది.

Honor X7c 5G smartphone telugu news

సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
హానర్‌ X7c 5G స్మార్ట్‌ఫోన్‌ 33W సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌ గా ఉంది. స్టీరియో స్పీకర్‌ లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.0, వైఫై 802.11ac, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

హానర్‌ X7c 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Honor X7c 5G Smartphone Sale) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఆగస్టు 20 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor X7c 5G smartphone with 6.8 inch display, super fast charging launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X