1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
హానర్ X9b 5G స్మార్ట్ ఫోన్ (Honor X9b 5G Smartphone Price Drop) మరోసారి తగ్గింపు ధరను పొందింది. ఈ హ్యాండ్ సెట్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ టెక్నాలజీ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే సహా భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్‌ను అమెజాన్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
హానర్ X9b 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.24,999 గా ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.22,999 కే కొనుగోలు చేయవచ్చు.

రూ.699 విలువైన ఛార్జర్ ఉచితం :
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా మరో రూ.4,000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు రూ.699 విలువైన 30W ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. మరియు 6 నెలలపాటు నో కాస్ట్ EMI సదుపాయాన్ని పొందవచ్చు.
యాంటీ డ్రాప్ టెక్నాలజీ :
హానర్ x9b 5G స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2652*1200 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

108MP ప్రైమరీ కెమెరా :
ఈ స్మార్ట్ ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. ఇది ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తుంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. హైఎండ్ వాచ్‌ల నుంచి ఈ డిజైన్‌ను తీసుకున్నారు.
ఆండ్రాయిడ్ 13 OS :
హానర్ x9b 5G స్మార్ట్ ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హానర్ కొత్త హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది.
5800mAh బ్యాటరీ :
ముఖ్యంగా ఈ ఫోన్ మేజిక్ టెక్ట్స్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఈ హానర్ x9b 5G స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన బ్యాటరీని పనితీరును కనబరుస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








