108MP కెమెరా, 256GB స్టోరేజీ హానర్ 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. కింద పడినా డ్యామేజీ కానీ ఫోన్ ఇదే..!!
హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ (Honor X9b 5G Smartphone price drop) ఈ సంవత్సరం తొలిరోజుల్లో విడుదల అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు 5800mAh బ్యాటరీ మరియు 108MP ప్రస్తుతం ఈ హానర్ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
విడుదల సమయంలో హానర్ X9b స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.25999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.22,999 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పేజీ ఆధారంగా ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.750 తగ్గింపును పొందవచ్చు.

హానర్ x9b స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2652*1200 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. 4nm క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హానర్ కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Magic OS 7.2 పైన పనిచేస్తుంది.
ఈ హానర్ x9b 5G స్మార్ట్ ఫోన్ మరో ఆకట్టుకొనే ఫీచర్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ ఫోన్ 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.
హానర్ x9b 5G హ్యాండ్‌సెట్ వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు గ్రావిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, కంపాస్, లైట్ సెన్సార్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
ప్రస్తుతం ఈ హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ ఆరేంజ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications