Home
Mobile

108MP కెమెరా, 5800mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. అమెజాన్ సేల్‌ పూర్తి వివరాలు..!!

హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ (Honor X9b 5G Smartphone Discount) ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌పై భారీ డిస్కౌంట్‌ ధరను పొందవచ్చు. ఈ సేల్‌ మే 7వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా రూ.7 వేల వరకు తగ్గింపును పొందవచ్చు.

హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. ఈ అమెజాన్‌ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌ కూపన్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి కేవలం రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ సేల్‌ ఆఫర్ల గడువు ఉన్నంత వరకు మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.3,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

amazon great summer sale 2024 offer on honor x9b 5G

హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
హానర్‌ x9b స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2652*1200 పిక్సల్‌ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

108MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా :
హానర్‌ x9b 5G హ్యాండ్‌సెట్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. ఐకానిక్‌ క్లాసికల్‌ డ్యూయల్‌ రింగ్‌ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

amazon great summer sale 2024 offer on honor x9b 5G

5800mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ హానర్‌ హ్యాండ్‌సెట్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హానర్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ Amazon Great Summer Sale 2024 లో హానర్‌ ఛాయిస్‌ వాచ్‌ పై భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ వాచ్‌ రూ.6499 కి విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.4999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు హానర్ ఛాయిస్‌ X5 ఇయర్‌బడ్స్‌ పై రూ.200 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.1799 కే కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor X9b 5G Smartphone gets huge discount in amazon great summer sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X