5800mAh బ్యాటరీ, 108MP కెమెరా సహా సూపర్ టెక్నాలజీతో Honor స్మార్ట్‌ఫోన్ విడుదల,, ధర, సేల్ వివరాలు..!
హానర్ ఇండియా తాజాగా హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ను (Honor X9b 5G Smartphone) లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 20GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది.
హానర్ x9b స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2652*1200 రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మెరుగైన ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హానర్ కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. మెరుగైన పనితీరును కనబరుస్తుందని హానర్ చెబుతోంది.
ముఖ్యంగా ఈ ఫోన్ మేజిక్ టెక్ట్స్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఈ హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని హానర్ చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తుంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. హైఎండ్ వాచ్‌ల నుంచి ఈ డిజైన్‌ను తీసుకున్నారు.
ఈ హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ హానర్ కొత్త ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB-C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. మరియు ఫోన్ కిందవైపు స్పీకర్లను కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌తో వస్తుంది. బ్లూటూత్ 5.1, వైపై 802.11 సపోర్టుతో వస్తుంది.
హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సహా ఇతర స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ICICI క్రెడిట్, డెబిట్ కార్డులు, EMI లావాదేవీలు నిర్వహిస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందుతారు.
అమెజాన్‌లో ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా రూ.5000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుతో 30W USB-C ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా రూ.2999 విలువైన హానర్ ప్రొటెక్ట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 6 నెలలపాటు వన్‌టైం స్క్రీన్ రీప్లెస్‌మెంట్, 6 నెలల వారంటీ, 18 నెలలపాటు డోర్ టూ డోర్ సర్వీస్ అసిస్టెంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications