Home
Mobile

108MP కెమెరా, 8GB ర్యామ్‌ Honor స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది.. ఈ బ్యాంక్‌ కార్డుపై రూ.3000 తగ్గింపు..!

హానర్‌ స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. తాజాగా హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ (Honor X9b 5G), హానర్ ఛాయిస్‌ ఇయర్‌బడ్స్‌ X5 (Honor Choice Earbuds X5) సేల్‌ ప్రారంభం అయింది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లా్క్‌ మరియు సన్‌రైజ్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

హానర్‌ X9b 5G (Honor X9b 5G Sale) స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందుతారు. మరియు 6 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.699 విలువైన ఛార్జర్‌ను అందిస్తోంది.

Honor X9b 5G smartphone sale on amazon

దీంతోపాటు రూ..2999 విలువైన హానర్‌ ప్రొటెక్ట్‌ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. తొలి ఆరు నెలల్లో ఒకసారి స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, 6 నెలలపాటు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, 30 రోజుల్లో 90 శాతం వరకు బైబ్యాక్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

హానర్‌ x9b స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2652*1200 రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మెరుగైన ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఈ ఫోన్‌ స్క్రీన్ అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

Honor X9b 5G smartphone sale on amazon

హానర్‌ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఈ హానర్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. మెరుగైన పనితీరును కనబరుస్తుందని హానర్‌ చెబుతోంది.

ముఖ్యంగా ఈ ఫోన్‌ మేజిక్ టెక్ట్స్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్‌ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఈ హానర్‌ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని హానర్‌ చెబుతోంది.

Honor X9b 5G smartphone sale on amazon

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది ఐకానిక్‌ క్లాసికల్‌ డ్యూయల్‌ రింగ్‌ డిజైన్‌తో వస్తుంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. హైఎండ్‌ వాచ్‌ల నుంచి ఈ డిజైన్‌ను తీసుకున్నారు.

దీంతోపాటు హానర్‌ ఛాయిస్ ఇయర్‌బడ్స్‌ X5 (Honor Choice Earbuds X5) ను ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌, www.explorehonor.com తోపాటు ఇతర స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ధర రూ.1,999గా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ మరియు ANC సపోర్టుతో వస్తాయి. 35 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Honor X9b 5G smartphone and Honor Choice Earbuds X5 sale started on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X