Home
Mobile

108MP కెమెరా, 5800mAh బ్యాటరీతో Honor స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, లాంచ్‌ వివరాలు..!

హానర్‌ సంస్థ క్రమంగా తన ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ను (Honor x9b 5G Smartphone) ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌తోపాటు హానర్‌ ఛాయిస్‌ ఇయర్‌బడ్స్‌ X5 మరియు హానర్‌ ఛాయిస్ వాచ్‌ను కూడా విడుదల చేయనుంది.

హానర్‌ x9b 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
హనర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. కళ్లను సౌకర్యవంతంగా ఉంచేందుకు ఈ ఫోన్ మెరుగైన పల్స్‌ విడ్త్‌ మాడ్యులేషన్‌ డిమ్మింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

Honor X9b 5G Smartphone to launch

స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంటుంది. 1.5 మీటర్ల ఎత్తు వరకు ఫోన్‌కు రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. అంటే 1.5 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ కింద పడినా ఎంటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది. హానర్‌ X9b IP53 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఫోన్‌ కొనుగోలు చేసిన 6 నెలల్లోగా ఒకసారి స్క్రీన్‌కు ఎటువంటి డ్యామేజీ జరిగినా ఉచితంగా రీప్లేస్‌మెంట్‌ చేస్తుంది.

హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌ వరకు సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MagicOS 7.2 UI పైన పనిచేస్తుంది. ఈ OS అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. మేజిక్‌టెక్ట్స్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా ఫొటో నుంచి టెక్ట్స్‌ను పొందవచ్చు.

Honor X9b 5G Smartphone to launch

హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 5800mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్ బ్లాక్‌, సన్‌రైజ్‌ ఆరెంజ్‌, ప్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. వెనుకవైపు వెగాన్ లెదర్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.

హానర్‌ ఛాయిస్‌ ఇయర్‌బడ్స్‌ X5 : హానర్‌ ఛాయిస్‌ ఇయర్‌బడ్స్‌ X5.. 30dB వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ (ANC)ను కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్‌ 35 గంటల గరిష్ట బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ ఇయర్‌బడ్స్‌ ergonomic ఇన్- ఇయర్‌ డిజైన్‌తో వస్తాయని పేర్కొంది. మరియు హానర్‌ AI స్పేస్‌ యాప్‌ను సపోర్టు చేస్తాయని, ఫలితంగా అదనపు ప్రయోజనాలు పొందుతాయని పేర్కొంది.

సింగిల్‌ ఛార్జింగ్‌లో 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ : హానర్‌ ఛాయిస్ వాచ్‌ 1.95 అంగుళాల అమోలెడ్‌ డిస్‌పేలను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ ఇన్‌బిల్డ్‌ గా GPS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మరియు హానర్‌ హెల్త్‌ యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor X9b 5G Smartphone to launch on February 15 in india here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X