108MP కెమెరా, 5800mAh బ్యాటరీ, 6.78 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్..!
హానర్ సంస్థ నుంచి గత నెలలో హానర్ X9b స్మార్ట్‌ఫోన్ (Honor X9b Smartphone Discount) విడుదల అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో భారీగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ వంటి రెండు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
రూ.3000 డిస్కౌంట్.. : హానర్ X9b స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.25999 గా ఉంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ను HDFC, SBI, ICICI కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

ఛార్జర్ ఉచితం, రూ.5000 ఎక్స్చేంజీ ప్రయోజనాలు : దీంతోపాటు నోకాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.699 విలువైన 30W అడాప్టర్‌ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.5000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు.
హానర్ x9b స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2652*1200 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉంటుంది.

హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హానర్ కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది. మెరుగైన పనితీరును కనబరుస్తుందని హానర్ చెబుతోంది.
ముఖ్యంగా ఈ ఫోన్ మేజిక్ టెక్ట్స్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫొటోను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఈ హానర్ x9b 5G స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని హానర్ చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. ఇది ఐకానిక్ క్లాసికల్ డ్యూయల్ రింగ్ డిజైన్‌తో వస్తుంది. 108MP ప్రధాన కెమెరా సహా 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. హైఎండ్ వాచ్‌ల నుంచి ఈ డిజైన్‌ను తీసుకున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








