108MP కెమెరా, 5800mAh బ్యాటరీతో Honor స్మార్ట్‌ఫోన్.. కింద పడినా డ్యామేజీ కాకుండా ప్రత్యేక టెక్నాలజీ..!
హానర్ క్రమంగా తన స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ను విస్తరిస్తోంది. ఇటీవలో భారత్ సహా కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ఫోన్ Honor X9b ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్‌లోనూ లాంచ్ కానుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న స్పెసిఫికేషన్లలో అధిక శాతం భారత్‌లో లాంచ్ అయ్యే మోడల్ కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ, అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే.. : హానర్ X పేజీ ఆధారంగా భారత్ మార్కెట్‌లో హానర్ X9b స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 15న విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలోనే తొలిసారిగా 'ఎయిక్‌బ్యాగ్ టెక్నాలజీ'తో 'అల్ట్రా బౌన్స్ డిస్‌ప్లే' ను కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ స్క్రీన్, ఫ్రేమ్, అంతర్గత విభాగాలకు రక్షణ కల్పిస్తుందని తెలుస్తోంది. 360 డిగ్రీ డివైజ్ ప్రోటెక్షన్‌తో వస్తుందని సమాచారం.

మరెన్నో అదనపు ప్రయోజనాలు : హానర్ X9b స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది. మరియు సన్‌రైజ్ ఆరెంజ్ రంగులో లభిస్తుంది. ఈ ఫోన్‌తోపాటు హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ X5e, 12 నెలల స్క్రీన్, బ్యాక్ కవర్ రక్షణ సహా 24 నెలల బ్యాటరీ వారంటీని పొందవచ్చు.
హానర్ X9b హ్యుండ్‌సెట్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1200*2652 పిక్సల్ రిజల్యూషన్‌తో రానుంది. భారత్ మార్కెట్‌లో హానర్ X9b స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.2 పైన పనిచేస్తుంది.

108MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా : కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
హానర్ X9b ఉహించిన ధర : ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 నుంచి రూ.30,000 మధ్యన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.23,999కు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 15న భారత్‌లో లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








