అదిరిపోయే డిజైన్‌తో హానర్ X సిరీస్ కొత్త ఫోన్.. విడుదల తేదీ లీక్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు..!
భారత్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ హానర్ నుంచి ఈ నెలలో X సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో హానర్ X9b హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసిన సంస్థ.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరో X సిరీస్ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే హానర్ సంస్థ (Honor Upcoming Smartphone in India) ఈ హ్యాండ్‌సెట్ పేరు సహా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ప్రముఖ టిప్‌స్టర్ ఈ హానర్ X సిరీస్ లో కొత్త ఫోన్ వివరాలను వెల్లడించారు.
అమెజాన్ ద్వారా సేల్ :
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ (Amazon) హానర్ హ్యాండ్‌సెట్ డిజైన్ సహా ఇతర వివరాలను వెల్లడించింది. అయితే హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ గా (Honor X9c 5G Smartphone) లాంచ్ కానుందని తెలుస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లోనే గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయింది. భారత్‌లోనూ గ్లోబల్ వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని వెల్లడించారు. ఫిబ్రవరి 15 వ తేదీన భారత్‌లో లాంచ్ కానుందని తెలిపారు. హానర్ కూడా ఈ హ్యాండ్‌సెట్ టీజర్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా ఈ ఫోన్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అద్భుతమైన కెమెరా ఫీచర్‌లు :
దీంతోపాటు టీజర్ ఇమేజ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ కెమెరా మాడ్యూల్ డిజైన్ విడుదల అయింది. వృత్తాకర మాడ్యుల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ కెమెరాలు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌లను సపోర్టును కలిగి ఉంటాయి.
Honor X9C 5G coming to india!! 🇮🇳🇮🇳
— Paras Guglani (@passionategeekz) February 3, 2025
15-Feb! pic.twitter.com/F3pv44CYGR
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ గ్లోబల్ వేరియంట్ X9c 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల (1224*2700 పిక్సల్స్) కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అయితే భారత్ వేరియంట్ కంటికి హాని చేయని డిమ్మింగ్ రేట్ ను కలిగి ఉంటుంది.
హానర్ X9c 5G గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా సహా f/2.2 అపేచర్‌తో 5MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
Something extraordinary is coming…Are you ready?
— Explore HONOR (@ExploreHONOR) February 3, 2025
Know more: https://t.co/zhc0fa0h0f#StayTuned #eXtra #ExploreHONOR #HONOR pic.twitter.com/873ZoYXGKO
6600mAh బ్యాటరీ :
బ్యాటరీ పరంగా 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP65 రేటింగ్ తో డస్ట్ వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర MYR 1500 గా ఉంది. అయితే భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30000 గా ఉండే అవకాశం ఉంది.
అయితే భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 15వ తేదీన విడుదల కానుందని టిప్‌స్టర్ వెల్లడించినా.. హానర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే గత వేరియంట్ కంటే అప్‌గ్రేడ్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








