Home
Mobile

108MP కెమెరా, 6600mAh బ్యాటరీ సహా సూపర్‌ ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళే విడుదల..!

Honor X9c 5G Smartphone Launch : హానర్ X9C 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలను సంస్థ వెల్లడించింది. డిజైన్ సహా కెమెరా, బ్యాటరీ సహా అనేక వివరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ 108MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 6600mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది?
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అనంతరం అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ సేల్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ హానర్‌ ఫోన్ టైటానియం బ్లాక్‌, జడే సియాన్ రెండు కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుంది.

Honor X9c 5G Smartphone launching today in india

డిజైన్‌ వివరాలు :
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా హనర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్‌ టైటానియం డిజైన్‌ ను కలిగి ఉంటుంది. 7.98mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మెరుగైన SGS డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను లాంచ్‌ కానుంది. మరియు IP65M రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల కర్వడ్‌ 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌, Low Blue Light సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

చిప్‌సెట్‌, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత MagicOS 9.0 ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 66W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో విడుదల కానుంది.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా f/1.7 అపేచర్‌, 3x జూమ్‌, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS), ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు మేజిక్‌ పోర్టల్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. AI Motion Sensing, AI Erase వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుందని హానర్‌ చెబుతోంది.

ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ ధర వివరాలు విడుదల సమయంలో వెల్లడి కానున్నాయి. అయితే మొత్తంగా ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

గతంలో విడుదల అయిన హానర్‌ X9b 5G స్మార్ట్‌ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌గా హానర్‌ X9c 5G మోడల్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడి కానున్నాయి. సెల్ఫీ కెమెరా, సహా అప్‌డేట్స్‌ వివరాలు వెల్లడి కానున్నాయి.

Best Mobiles in India

English summary
Honor X9c 5G Smartphone launching today in india here are the confirmed specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X