Home
Mobile

108MP కెమెరా, 6600mAh బ్యాటరీ, భారీ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఆకట్టుకొనే డిజైన్ సహా ఫీచర్లు..!

Honor X9c 5G Smartphone launched : హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ 108MP కెమెరా, 6600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ హానర్‌ ఫోన్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు.

హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హానర్ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఫ్లిక్కర్‌ ఫ్రీ, Low Blue లైట్‌ TUV Rheninland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

Honor X9c 5G Smartphone

డ్రాప్‌ రెసిస్టెన్స్‌ :
ఈ ఫోన్ SGS డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ -30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 55 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఫోన్‌ డ్యామేజీ కాకుండా కాపాడుతుంది. మరియు IP65M డస్ట్‌ మరియు 360 డిగ్రీ వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 7.98 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Adreno 719 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది.

6600mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ AI Motion Sensing, AI Erase, AI Deepfake Detection, AI Magic Capsule, AI Magic Portal 2.0 వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్‌ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది.

Honor X9c 5G Smartphone

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS, EIS, f/1.7 అపేచర్‌, 3x లాస్‌లెస్‌ జూమ్‌తో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 5MP వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను అమర్చి ఉంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.1, వైఫై, GPS, NFC, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

Take a Poll

హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్ (Honor X9c 5G Sale Date) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా ICICI, SBI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హానర్‌ స్మార్ట్‌ఫోన్ టైటానియం బ్లాక్‌, జడే సియాన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Honor X9c 5G Smartphone with 108MP Camera, 6600mAh Battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X