Home
Mobile

108MP కెమెరా, 6600mAh బ్యాటరీ, 6.78 అంగుళాల కర్వడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్.. జులై 7 న విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ హానర్‌ నుంచి త్వరలో భారత్ మార్కెట్‌ లోకి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. హానర్‌ X9c 5G (Honor X9c 5G Smartphone launch Date) పేరుతో విడుదల చేయనుంది. గతంలో విడుదల అయిన X9b మోడల్‌ కు తర్వాత తరం స్మార్ట్‌ఫోన్‌ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 108MP కెమెరా, 6600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది? :
హానర్ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో జులై 7 వ తేదీన విడుదల కానుంది. మరియు ఈ ఫోన్‌ జులై 12 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హానర్‌ హ్యాండ్‌సెట్ జడే సియాన్‌, టైటానియం బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Honor X9c 5G Smartphone

డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల కర్వడ్‌ 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌, Low Blue Light సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటుందని హానర్‌ తెలిపింది. దీంతోపాటు SGS డ్రాప్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌ ను కూడా కలిగి ఉంటుంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
హానర్‌ X9c 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ వేరియంట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Magic OS 9.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Honor X9c 5G Smartphone

6600mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మేజిక్‌ పోర్టల్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. AI Motion Sensing, AI Erase వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 66W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6600mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.

108MP OIS, EIS కెమెరా :
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా వివరాలను హానర్‌ సంస్థ వెల్లడించింది. f/1.7 అపేచర్‌, 3x జూమ్‌, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS), ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రానుంది. మిగిలిన కెమెరా వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

హానర్‌ X9c 5G స్మార్ట్‌ ఫోన్ 7.98mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు IP65M డస్ట్‌ మరియు 360 డిగ్రీ వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుందని అమెజాన్ మైక్రోసైట్‌ ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ మరిన్ని స్పెసిఫికేషన్‌ ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor X9c 5G Smartphone with snapdragon 6 Gen 1 SoC Chipset confirmed to launch on july 7 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X