108MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే, 6600mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హానర్ నుంచి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. త్వరలో హానర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. X ఫోస్ట్ ఆధారంగా హానర్ ఇండియా ఈ వివరాలను వెల్లడించింది. అయితే ఎప్పుడు విడుదల చేస్తారనే కచ్చితమైన తేదీని హానర్ వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి.
అమెజాన్ ద్వారా సేల్ :
భారత్ మార్కెట్‌లో హానర్ X9c (Honor X9c Smartphone) పేరుతో విడుదల కానుంది. ఈ ఫోన్ గత సంవత్సరం నవంబర్‌లోనే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ విడుదల అయింది. విడుదల అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

అయితే గత సంవత్సరం ఫిబ్రవరిలో భారత్ మార్కెట్‌లో హానర్ నుంచి X9b స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా హానర్ X9c లాంచ్ కానుందని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ వివరాలను హానర్ వెల్లడించలేదు. అయితే అమెజాన్ మైక్రోసైట్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
SGS డ్రాప్ రెసిస్టెంట్ :
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా హానర్ X9c స్మార్ట్‌ఫోన్ SGS డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతోపాటు IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మరియు డిజైన్ పరంగా ఈ ఫోన్ 7.98mm థిక్‌నెస్ తోపాటు 189 గ్రాముల బరువు ఉంటుంది.
6.78 అంగుళాల డిస్‌ప్లే, 6600mAh బ్యాటరీ :
ఈ హానర్ X9c స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840 PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 66W వైర్ సూపర్‌ఛార్జ్ సపోర్టుతో 6600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హానర్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేస్తుంది.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హానర్ X9c స్మార్ట్‌ఫోన్ f/1.7 అపేచర్, 3x లాస్‌లెస్ జూమ్‌తో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది.
బెస్ట్ సౌండ్ అపుట్‌పుట్ :
ఈ ఫోన్ మోషన్ సెన్సింగ్, AI Erase వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిటింగ్ యాప్స్‌ను కూడా కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 300 శాతం సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
హానర్ X9c స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. అయితే మలేషియాలో ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర MYR 1499 (భారత కరెన్సీ ప్రకారం రూ28,700) గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర MYR 1699 (భారత కరెన్సీ ప్రకారం రూ.32,500) గా ఉంది.


Click it and Unblock the Notifications








