మొబైల్స్‌కి అనుకూలంగా వీడియోస్ మార్చుకోవడం ఎలా?

Posted By: Staff

మొబైల్స్‌కి అనుకూలంగా వీడియోస్ మార్చుకోవడం ఎలా?

ఆధునిక డిజిటల్‌ పరికరాలన్నింటిలో తెర పరిమాణం, పిక్సల్‌ నాణ్యత వేర్వేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కావలసిన వీడియోల ఫార్మెట్‌ను వీటికి అనుగుణంగా మార్చుకోవడం తప్పని సరి. ఈ పని చేసిపెట్టే ఉచిత కన్వర్టర్‌ టూల్స్‌ ఆన్‌లైన్‌లో చాలానే ఉన్నాయి.

ఐప్యాడ్‌, ఐఫోన్‌, ఐపాడ్‌... వాడుతున్నవారి కోసం Aleesoft Free iPad Video Converter. ప్రొఫైల్‌ మెనూలో కనిపించే వివిధ ఫార్మెట్లలో కావలసినదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆపై New Taskతో వీడియో ఫైల్‌ని అప్‌లోడ్‌ చేయాలి. పక్కనే ఉన్న Convert ద్వారా ఫార్మెట్‌ మార్చుకోవచ్చు. ఎక్కువ మెమొరీతో ఉన్న ఫైల్‌ని Splitతో విడి భాగాలుగా మార్చుకునే వీలుంది.

ఏ పరికరం వాడుతున్నా కావాల్సిన ఫార్మెట్‌లోకి వీడియోలను మార్చుకునేందుకు అనువుగా రూపొందించిందే Free Studio. ఎనిమిది విభాగాలుగా ఉన్న మెనూ ద్వారా ఆడియో, వీడియో ఫైల్స్‌ని మార్చుకోవచ్చు. MP3 & Audio, DVD & Video, Photo & Images లాంటి విభాగాలున్నాయి. యూట్యూబ్‌ వీడియోలను అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌ చేయడానికి YOUTUBE ఉంది. దీని ద్వారా వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫార్మెట్‌ మార్చుకునే వీలుంది.

అలాగే మొబైల్స్‌ మోడల్స్‌ కూడా ఎంచుకోవచ్చు. సీడీ, డీవీడీలపై డేటాని కూడా రైట్‌ చేసుకోవచ్చు. 3D ఫొటో, వీడియో ఆల్బమ్‌లను క్రియేట్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లకు అనువుగా వీడియోలను మార్చుకోవాలంటే Free Video to Android Converterను పొందండి.

హోం పేజీ నుంచే గుర్తుల ఆధారంగా ఫార్మెట్‌ను మార్చేలా అందుబాటులోకి వచ్చిందే Quick Media Converter HD. వాడే ఫోన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియోలను మార్చుకోవచ్చు. వీడియోలను హై డెఫినెషన్‌ ఫార్మెట్‌లోకి మార్చుకోవచ్చు. Expert Modeతో వీడియో, ఆడియో ఫైల్స్‌ను నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. WebCam ద్వారా వీడియోలను రికార్డ్‌ చేయవచ్చు.

ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా వీడియోలు మార్చుకోడానికి Videora కన్వర్టర్లు ఉన్నాయి. నోకియా ఎన్‌97 వాడుతున్నట్లయితే దానికి సంబంధించిన కన్వర్టర్‌ని మాత్రమే పొందవచ్చున్నమాట. ఇలా యాపిల్‌, సోనీ, బ్లాక్‌బెర్రీ, హెచ్‌టీసీ, మైక్రోసాఫ్ట్‌, ఎల్‌జీ, శామ్‌సంగ్‌, మోటరోలా, సోనీఎరిక్సన్‌ లాంటి వివిధ పరికరాలకు వేర్వేరు కన్వర్టర్‌లు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot