JioPhone ప్రీ-బుకింగ్ స్టేటస్ తెలుసుకోవటం ఎలా..?

ఇప్పటికే ఈ ఫోన్‌లను బుక్ చేసుకున్న చాలా మంది యూజర్లు తమ ఫోన్ బుకింగ్ స్టేటస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోలేకపోతున్నారు.

|

జియోఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమవటంతో చాలా మంది ఈ ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌లను బుక్ చేసుకున్న చాలా మంది యూజర్లు తమ ఫోన్ బుకింగ్ స్టేటస్‌కు సంబంధించిన వివరాలను తెలుసు కోలేకపోతున్నారు.

JioPhone బుకింగ్స్.. మీరు తెలసుకోవల్సిన ముఖ్యమైన విషయాలుJioPhone బుకింగ్స్.. మీరు తెలసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు

18008908900కు డయల్ చేస్తే..

18008908900కు డయల్ చేస్తే..

జియో ఫోన్‌లను ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 18008908900కు డయల్ చేసి తమ వివరాలను తెలపటం ద్వారా బుకింగ్ స్టేటస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ తెలుస్తాయి. ప్రస్తుతానికి ఈ నెంబర్ హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. జియో కస్టమర్లు మైజియో యాప్ ద్వారా ఫోన్ బుకింగ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

ఆగష్టు 24 నుంచి ప్రారంభమయ్యాయి..

ఆగష్టు 24 నుంచి ప్రారంభమయ్యాయి..

జియోఫోన్ ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24, సాయంత్రం 5.30 నిమిషాల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ ఛానల్స్ ద్వారా ఈ ఫోన్ లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫోన్‌లను బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio app లేదా కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

 ప్రీ-బుకింగ్ సమయంలో రూ.500 అడ్వాన్స్ క్రింద చెల్లించాల్సి ఉంటుంది

ప్రీ-బుకింగ్ సమయంలో రూ.500 అడ్వాన్స్ క్రింద చెల్లించాల్సి ఉంటుంది

జియోఫోన్ కొనుగోలుదారులు ఫోన్ ప్రీ-బుకింగ్ సమయంలో రూ.500 అడ్వాన్స్ క్రింద చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ డెలివరీ అయిన తరువాత మిగలిన రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ను 36 నెలలు తరువాత మీరు ఫోన్ వద్దనుకుంటే వాపసు ఇచ్చేస్తారు.

మైజియో యాప్ ద్వారా జియోఫోన్‌ను బుక్ చేయాలంటే..

మైజియో యాప్ ద్వారా జియోఫోన్‌ను బుక్ చేయాలంటే..

మైజియో యాప్ ద్వారా జియోఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవాలను కుంటున్నట్లయితే ముందుగా యాప్‌ను ఓపెన్ చేయండి. వెంటనే మీకు ప్రీ బుకింగ్ స్ర్కీన్ కనిపిస్తుంది. ప్రీ-బటన్ పై క్లిక్ చేసినట్లయితే తరువాతి పేజీలోకి వెళతారు. అక్కడ మీ మొబైల్ నెంబర్‌తో పాటు మీ అడ్రస్ ఇంకా పిన్‌కోడ్ వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే పేమెంట్ చేసేందుకు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని రూ.500 పేమెంట్ పూర్తి చేసినట్లయితే బుకింగ్ విజయవంతమవుతుంది.

ఆఫ్‌లైన్‌ మోడ్‌లో..

ఆఫ్‌లైన్‌ మోడ్‌లో..

ఆఫ్‌లైన్‌ మోడ్‌లో జియో ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే మీ సమీపలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా జియో రిటైలర్ వద్దకు వెళ్లి ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to check the pre booking status of your JioPhone?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X