ఆండ్రాయిడ్ యూజర్లకు ముఖ్యమైన వాట్స్‌యాప్ ‘బ్లూ టిక్స్’ సమాచారం

Posted By:

మీ వాట్స్‌యాప్ అకౌంట్‌లో గత కొద్ది రోజులుగా మీరు పంపిన సందేశాలకు సంబంధించి వాటి పక్కన బ్లూ కలర్ టిక్  మార్క్‌లు (Blue Tick Marks) కనిపించటాన్ని గమనించే ఉంటారు. వాట్స్‌యాప్ గత వారం బ్లూటిక్స్ రీడ్ రిసిప్ట్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మీరు పంపిన సందేశం పక్కన సింగిల్ బ్లూ‌టిక్ కినిపించినట్లయితే సదరు మెసేజ్ అవతలి వ్యక్తికి చేరినట్లు అర్థం, రెండు బ్లూ‌టిక్ మార్క్‌లు (2 Blue Tick Marks) కనిపించినట్లయితే సదరు మెసేజ్‌ను అవతలి వ్యక్తి చదివినట్లు అర్ధం.

వాట్స్‌యాప్ ‘బ్లూ టిక్స్’

వాట్స్‌యాప్ గురించి అంతగా అవగాహన లేని చాలమంది వినియోగదారులు గతంలో తమ మెసేజ్‌ల పక్కన కనిపించే గ్రే కలర్ టిక్ మార్క్‌లను (Grey Colour Tick Marks) చూసి అవతలి వాళ్లు మన సందేశాలను చదివేసారని భావించే వారు. వాస్తవానికి వాటి అర్థం అదికాదు. ఒక గ్రే టిక్ ఉంటే మీరు పంపిన సందేశం వాట్స్‌యాప్ సర్వర్‌కు చేరినట్లు, రెండు గ్రే‌టిక్స్ ఉంటే అవతలి వ్యక్తి ఫోన్‌కు ఆ మెసేజ్ వెళ్లినట్లని అర్థం. తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లూటిక్స్ ఫీచర్ అవతలి వ్యకి మన సందేశాలు చదివిన పిదప ఆ ధృవీకరణను రెండు బ్లూ ‌టిక్ మార్క్స్ రూపంలో మనకు చూపిస్తుంది.

వివాదాస్పదం...

వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన బ్లూటిక్స్ రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ వివాదాస్పదమైంది. చాలా మాంది యూజర్లు తాము పంపిన సందేశాలను అవతలి వ్యక్తులు చూస్తున్నారా..? లేదా..? అన్న అంశాన్ని బ్లూటిక్స్ ఆప్షన్ ద్వారా తెలసుకోవటం ప్రారంభించారు. దీంతో తమ మెసెజ్‌లను చదవని పక్షంలో పలువురు మనస్థాపానికి గురువుతున్నట్లు వెల్లడవుతోంది.

ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వాట్స్‌యాప్ తాను ప్రవేశపెట్టిన బ్లూటిక్స్ రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సరికొత్త బ్లూటిక్స్ డిసేబుల్ అప్‌గ్రేడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ అవకాశం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ‘బ్లూటిక్స్' ఫీచర్ అకర్లేదని అనుకునే వాళ్లు ఈ డిసేబుల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

బ్లూటిక్ ఫీచర్‌ను డిసేబుల్ చేసేందుకు అనుసరించవల్సిన సూచనలు:

- బ్లూటిక్స్ డిసేబుల్ ఫీచర్‌ను మీ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేయాలంటే ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 2.1 లేదా ఆ తరువాతి వర్షన్ పై పనిచేసేదిగా ఉండాలి.

- తదుపరి చర్యంలో భాగంగా మీ ఫోన్ సెక్యూరిటీ ట్యాబ్‌లోని సెట్టింగ్స్ మెనూలోకి ప్రవేశించి ‘Download from Unknown Sources' ను ఎనేబుల్ చేయండి.

- తరువాతి చర్యగా వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి అందుబాటులో ఉన్న 2.11.444 version APK fileను డౌన్‌లోడ్ చేసుకోండి.

- ఫైల్ డౌన్‌లోడింగ్ పూర్తి అయిన తరువాత డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

- ఇప్పుడు మీ ఫోన్‌లోని వాట్స్‌యాప్ ఫీచర్ అప్‌డేట్ అవుతుంది.

- తరువాతి స్టెప్‌లో భాగంగా మీ వాట్స్‌యాప్ అకౌంట్‌కు సంబంధించి సెట్టింగ్స్‌లోని ప్రైవసీ అప్షన్‌లోకి వెళ్లినట్లయితే ‘Read Receipts' పేరుతో ఓ ఆఫ్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు పంపే సందేశాలకు సంబంధించి బ్లూటిక్స్ ఫీచర్ డిసేబుల్ అవుతుంది.

- తద్వారా మీరు పంపే సందేశాలకు బ్లూటిక్స్ తొలగించబడతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to disable WhatsApp ‘blue ticks’ on Android. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot