ఆండ్రాయిడ్ మొబైల్స్‌లలో ఇప్పుడు SNAPTU ఫీచర్

Posted By: Staff

ఆండ్రాయిడ్ మొబైల్స్‌లలో ఇప్పుడు SNAPTU ఫీచర్

జావా ఫోన్లను వాడినవారికి SNAPTU అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది. twitter , facebook, ఫ్లిక్కర్ , పికాసో లాంటి అనేక సోషల్ మరియు క్రికెట్ , వాతావరణ విశేషాలతో ఉండే అప్లికేషన్ల కలయుకే ఈ SNAPTU . ఈ అప్లికేషన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది "RSS -న్యూస్ " మీకునచ్చిన ఏ RSS ఫీడ్ నైనా ఈ సెక్షన్లో జతపర్చుకోవచ్చు . క్రిందఈ అప్లికేషన్ యొక్క స్క్రీన్ షాట్ చూడండి . నిజానికి ఈ అప్లికేషన్ వాడడం మొదలెడితే మీ ఫోన్లో ఇప్పటికే ఉన్న మిగతా సోషల్ అప్లికేషన్లను వదిలేయడం ఖాయం.

ఇదంతా ఇక్కడెందుకు చెపుతున్నానంటే మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇప్పుడు SNAPTU ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు . స్నాప్టు ఆండ్రాయిడ్ ఫోన్లకోసం విడుదల చేయబోతున్న అప్లికేషన్ యొక్క ఆల్ఫా వెర్షన్ లింక్ లీకయింది . దానికి సంబంధించిన సమాచారం ఈ http://m.snaptu.com/android/snaptu.apk లింక్‌లో చూడోచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot