Honor 8X రాకతో మిడ్-రేంజ్ మార్కెట్‌కు కొత్త కళ!

కాలంతో పాటు మనుషులు, మనుషులతో పాటు టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.

|

కాలంతో పాటు మనుషులు, మనుషులతో పాటు టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. గతకొద్ది సంవత్సరాలుగా మారుతూ వస్తోన్న ట్రెండ్‌లను మనం అంచనా వేసినట్లయితే స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

హై-ఎండ్ ఫోన్‌లతో పోటీగా హానర్ 8ఎక్స్‌

హై-ఎండ్ ఫోన్‌లతో పోటీగా హానర్ 8ఎక్స్‌

ఒకప్పటి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుత మిడ్ రేంజ్ ఫోన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి దూసుకొచ్చిన హానర్ హై-ఎండ్ ఫోన్‌లతో పోటీగా మిడ్-రేంజ్ ఫోన్‌లను అందిస్తున్నాయి. తాజాగా ఈ బ్రాండ్ హానర్ 8ఎక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫోన్ ధర రూ.14,999.

మిడ్-రేంజ్ మార్కెట్‌కు కొత్త కళ

మిడ్-రేంజ్ మార్కెట్‌కు కొత్త కళ

హానర్ 7ఎక్స్‌కు సక్సెసర్ వెర్షన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన హానర్ 8ఎక్స్ మిడ్-రేంజ్ మార్కెట్‌కు కొత్త కళను తీసుకువచ్చింది. ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన 6.5 అంగుళాల బారీ స్ర్కీన్, స్లిమ్ బీజిల్స్ అలానే చిన్న నాట్చ్‌ ఆధునిక డిజైనింగ్‌కు అద్దం పడుతోంది. హానర్ 8ఎక్స్‌లో ఎక్విప్ చేసిన భారీ స్ర్కీన్ ఫుల్ హెచ్‌డి ప్లస్ (1080 x 2340) రిసల్యూషన్ ను ఆఫర్ చేస్తుంది. ఈ రిసల్యూషన్ 396 పిక్సల్ పర్ ఇంచ్ (పీపీఐ)తో సమానం.

 

 

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ...
 

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ...

వైబ్రెంట్ డిస్‌ప్లేకు తోడుగా ఫోన్‌లో ఎక్విప్ చేసిన శక్తివంతమైన స్పీకర్ లౌడ్ ఇంకా క్లియర్ ఆడియో అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. హానర్ 8ఎక్స్‌లో లోడ్ చేసిన 3,750mAh బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది. హానర్ 8ఎక్స్‌లో పొందుపరిచిన ఇంటెలిజెన్స్ పవర్ సేవింగ్ టెక్నాలజీ బ్యాటరీ లైఫ్‌ను 33 శాతం వరకు పెంచగలగదట.

డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్..

డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్..

హానర్ 8ఎక్స్ ఎడమ చేతి వైపు భాగంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ కార్డ్ ట్రేలో రెండు నానో-సైజిడ్ (nano-sized) సిమ్ కార్డులతో పాటు మైక్రోఎస్డీ కార్డును ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. ఫోన్ కుడి చేతి వైపు వాల్యుమ్ అలానే పవర్ లాక్ బటన్లు అమర్చి ఉంటాయి. వీటిని ఈజీగా రీచ్ అవ్వొచ్చు.

 

 

మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌..

మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌..

డివైస్ వెనుక భాగాన్ని పరిశీలించినట్లయితే 20 మెగా పిక్సల్ + 2మెగా పిక్సల్ కాంభినేషన్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ మనకు కనిపిస్తుంది. ఈ సెటప్ పక్కనే ఎల్ఈడి ఫ్లాష్ మనకు కనిపిస్తుంది. ఈ కెమెరా హై-ఎండ్ ఫోన్‌లకు పోటీగా హైక్వాలిటీ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి హానర్ 8ఎక్స్ మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఇందుకు ప్రధానమైన కారణం ఫోన్ వెనక భాగంలో అమర్చిన మెటల్ ఫ్రేమ్ ఇంకా ఫోన్ మొత్తాన్ని కవర్ చేసిన 2.5డి గ్లాస్.

 

 

హైసిలికాన్ కిరన్ 710 ఆక్టా-కోర్ ప్రాసెసర్..

హైసిలికాన్ కిరన్ 710 ఆక్టా-కోర్ ప్రాసెసర్..

ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే హానర్ 8ఎక్స్ తన కూల్ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను మంత్ర ముగ్దులను చేస్తోంది. ఇక హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి హానర్ 8ఎక్స్ హైసిలికాన్ కిరన్ 710 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు అటాచ్ చేసిన మాలీ-జీ51 ఎంపీ గ్రాఫిక్ ప్రాసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ గేమింగ్‌ను ఈ చిప్‌సెట్ ఆఫర్ చేస్తుంది.

4జీబి ర్యామ్‌ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్..

4జీబి ర్యామ్‌ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్..

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే ఈ డివైస్‌లో 4జీబి ర్యామ్‌తో పాటు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వెర్షన్ ఆధారంగా బిల్డ్ చేసిన EMUI 8.2 పై ఫోన్ రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
How Honor 8X shines out in the crowd of affordable smartphones.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X