మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?

|

ఏ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ బ్యాకప్ త్వరగా సగ్గిపోవటం సాధారణ అంశమే. అయితే పలు పవర్-సేవింగ్ చిట్కాలను పాటించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను కొంత వరకు సేవ్ చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో చూద్దామా...

 

మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి. (Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

 

మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం రావాలంటే 2జీ నెట్‌వర్క్‌లోనే కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోండి. కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే వాడమని మీ ఫోన్ కు ఆర్డర్ ఇవ్వండి. (Settings » Wireless controls » Mobile networks » Use only 2G networks) ఆప్షన్‌ల ద్వారా ఈ విధానాన్ని మీ ఫోన్‌లో అమలు చేయవచ్చు. అవసరానికి మాత్రమే ఎడ్జ్, వై-పై నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోండి.

ఫోన్ డిస్‌ప్లేకు సంబంధించి కాంతి (బ్రైట్‌నెస్)ను తగ్గించుకోవటం వల్ల బ్యాటరీ శక్తిని కొంత వరకు ఆదా చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X