నాలుగు కెమెరాలతో Honor 9 Lite, రూ.10,999కే సంచలన స్మార్ట్‌ఫోన్

|

ప్రస్తుత మార్కెట్లో డ్యుయల్-లెన్స్ కెమెరా స్మార్ట్‌ఫోన్స్ అనేవి కామన్ థింగ్‌గా మారిపోయాయి. ఒకప్పుడు వీటిని కొనుగోలు చేయాలంటే రూ.30,000 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుత మార్కెట్లో ఇవి రూ.7000 నుంచే లభ్యమవుతున్నాయి. డ్యుయల్ లెన్స్ కెమెరా ఫోన్‌‌లను అందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న హానర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ డ్యుయల్ కెమెరా ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది.

 
నాలుగు కెమెరాలతో Honor 9 Lite, రూ.10,999కే సంచలన స్మార్ట్‌ఫోన్

తాజాగా ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన 'హానర్ 9 లైట్’ (Honor 9 Lite) డ్యుయల్ లెన్స్ కెమెరాల విభాగంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. రూ.11,000 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 4 కెమెరాలను హానర్ నిక్షిప్తం చేసింది. శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌లతో స్పందించగలిగే ఈ కెమెరాలు హై-క్వాలిటీ అవుట్‌పుట్‌ను ఆఫర్ చేయగలుగుతాయి.

హానర్ 9 లైట్ కెమెరా స్పెసిఫికేషన్స్..

హానర్ 9 లైట్ కెమెరా స్పెసిఫికేషన్స్..

Huawei నుంచి లాంచ్ అయిన రెండవ క్వాడ్-లెన్స్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా హనర్ 9 లైట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫోర్-లెన్స్ కెమెరా సిస్టం హార్డ్‌వేర్ లెవల్ bokeh ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ముందూ వెనుకా భాగాల్లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్స్, మొబైల్ ఫోటోగ్రఫీ స్టాండర్డ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్లాయనే చెప్పొచ్చు. ఈ కెమెరాల్లో పొందుపరిచిన 2 మెగా పిక్సల్ సెకండరీ లెన్స్, హార్డ్‌వేర్-లెవల్ bokeh ఎఫెక్ట్స్‌‌కు అవసరమైన డెప్త్ ఆఫ్

ఫీల్డ్‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లోని రేర్ కెమెరా యూనిట్ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్‌ను సపోర్ట్ చేయటంతో పాటు 1080 పిక్సల్ క్వాలిటీలో వీడియోలను కూడా రికార్డ్ చేయగలుగుతుంది.

యూజర్ ఫ్రెండ్లీ కెమెరా యాప్..

యూజర్ ఫ్రెండ్లీ కెమెరా యాప్..

9 లైట్ ఫోన్‌లోని క్వాడ్-లెన్స్ కెమెరా యూనిట్‌ను మరింత సింపుల్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో లోడ్ చేసిన ప్రత్యేకమైన కెమెరా యాప్ అన్ని మోడ్స్ అలానే ఫిల్టర్స్‌ను ఒకేచోట అందుబాటులో ఉంచి సులువైన ఆపరేటింగ్‌కు తోడ్పడుతుంది. పోర్ట్రెయిడ్ మోడ్, వైడ్ అపెర్చుర్ మోడ్, మూవింగ్ పిక్షర్స్ అండ్ బ్యూటీ మోడ్‌ను మెయిన్ స్ర్కీన్ పైనే యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ‌

సింపుల్ స్వైప్స్‌తో కెమెరా ఆపరేటింగ్...
 

సింపుల్ స్వైప్స్‌తో కెమెరా ఆపరేటింగ్...

9 లైట్ ఫోన్‌లోని ఇమేజ్ రిసల్యూషన్, జీపీఎస్, టైమర్, టచ్ టు క్యాప్చుర్ వంటి ప్రధానమైన కెమెరా సెట్టింగ్స్‌ను యాక్సిస్ చేసుకునేందుకు కెమెరా మెయిన్ స్ర్కీన్ పై ఎడమచేతి వైపు స్వైప్ చేస్తే సరిపోతుంది.

స్ర్కీన్ పై కుడిచేతి వైపు స్వైప్ చేసినట్లయితే ఫోటో, ప్రో ఫోటో (మాన్యువల్ మోడ్), వీడియో, ప్రో వీడియో, హెచ్‌‌డి‌ఆర్, నైట్ షాట్, పానోరమా, లైట్ పెయింటింగ్, టైమ్-ల్యాప్స్, ఫిల్టర్స్, వాటర్‌మార్క్ వంటి మోడ్స్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్టర్స్‌ను సైతం ఇదే సెక్షన్ నుంచి పొందే వీలుంటుంది.

 గ్రూప్ సెల్ఫీస్, పానోరమా సెల్ఫీస్, గెస్ట్యర్ సపోర్ట్...

గ్రూప్ సెల్ఫీస్, పానోరమా సెల్ఫీస్, గెస్ట్యర్ సపోర్ట్...

9 లైట్ సెల్ఫీ కెమెరాలోని పానోరమా సెల్ఫీ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా హై-క్వాలిటీ గ్రూప్ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని స్మార్ట్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ షాట్ క్యాప్చుర్ అయ్యే సమయంలో గెస్ట్యర్స్‌తో పాటు స్మైల్స్‌ను సెన్స్ చేయగలుగుతుంది.

బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !

స్టన్నింగ్ పోర్ట్రెయిట్ షాట్స్..

స్టన్నింగ్ పోర్ట్రెయిట్ షాట్స్..

9 లైట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా షూటర్స్ ద్వారా స్టన్నింగ్ పోర్ట్రెయిట్ షాట్స్‌ను యూజర్లు పొందవచ్చు. రేర్ కెమెరాను ఆపరేట్ చేస్తున్నపుడు పోర్ట్రెయిట్ మోడ్ లేదా వైడ్‌అపెర్చుర్ మోడ్ పై టాప్ చేసినట్లయితే హై-క్వాలిటీ పోర్ట్రెయిట్ షాట్‌ను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

ఫ్రంట్ కెమెరాలో నిక్షిప్తం చేసిన ‘పోర్ట్రెయిట్ మోడ్' అప్‌గ్రేడెడ్ బ్యూటీ అల్గారిథమ్‌తో వర్క్ అవుతుంది. స్కిన్ టోన్స్, కలర్, ఏజ్, జెండర్ ఇంక సబ్జెక్ట్స్ మధ్య తేడాలను ఈ అల్గారిథమ్‌ గుర్తించి తగిన విధంగా రిజల్ట్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది.

 పూర్తిస్థాయి ప్రో ఫోటో, ప్రో వీడియో మోడ్

పూర్తిస్థాయి ప్రో ఫోటో, ప్రో వీడియో మోడ్

9 లైట్ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా సెట్టింగ్స్‌ను మీకు కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలతో పాటు వీడియోలను క్యాప్చుర్ చేసుకునేందుకు కూడా మాన్యువల్ మోడ్‌ను ఉపయోగించుకోవచ్చు. ‘Pro photo' అలానే ‘Pro video' మోడ్‌లను ప్రత్యేకించి యూజర్ అవసరాల నిమిత్తం డిజైన్ చేసినట్లు హానర్ తెలిపింది.

ఈ మోడ్స్ ద్వారా మీటరింగ్‌, షట్టర్ స్పీడ్, ఈవీ, మాన్యువల్ ఫోకసింగ్, వైట్ బ్యాలన్స్ ఇంకా ఇతర అడ్వాన్సుడ్ సెట్టింగ్స్‌ను కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.

నైట్ షాట్, లైట్ పెయింటింగ్

నైట్ షాట్, లైట్ పెయింటింగ్

9 లైట్ స్మార్ట్‌ఫోన్‌లోని క్వాడ్ లెన్స్ కెమెరా, తక్కువు వెళుతురు కండీషన్స్‌లోనూ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ‘నైట్ షాట్' మోడ్ ద్వారా లో-లైటింగ్ వాతావరణంలోనూ బెటర్ క్వాలిటీ ఫోటోలను యూజర్లు క్యాప్చుర్ చేసుకోవచ్చు. మరో మోడ్ ‘లైట్ పెయింటింగ్' ద్వారా లాంగ్ ఎక్స్‌పోజర్ ఇమేజ్‌లను టెయిల్ లైట్ ట్రయిల్స్, లైట్ గ్రాఫిటీ, సిల్కీ వాటర్, స్టార్ ట్రెయిల్ వంటి నాలుగు నాలుగు విభిన్నమైన మోడలలో పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Honor 9 Lite is a budget smartphone with a quad-lens camera setup. The smartphone's front and rear cameras can create bokeh effect and comes packed with several modes and filters. Available in two variants, Honor 9 Lite is priced at Rs. 10,999 for the 3GB RAM variant and at Rs. 14,999 for the 4GB RAM variant on Flipkar

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X