మొబైల్‌కి తాళం వేయాలంటే ఎలా?

Posted By: Staff

మొబైల్‌కి తాళం వేయాలంటే ఎలా?

మనం ఇంట్లో లేదా ఆఫీస్‌లో వాడేటటువంటి పర్సనల్ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైల్స్‌ని భద్రం చేస్తుంటాం. అవి ఇతరుల కంట పడకూడదంటే ఫోల్డర్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లి మాయం చేస్తాం. ఇలా ఏ పరికరంలో చేసినా ఆ పరిజ్ఞానం ఉన్నవారు వాటిని చిటికెలో పట్టేస్తారు. మరైతే ఇతరుల కంట పడకుండా దాచుకునే మార్గాలు లేవా? అందుకు ప్రత్యేక టూల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. వాటికి తాళం వేసి మన ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరుల కంట పడకుండా కాపాడుకోవచ్చు. ఐతే ప్రస్తుత కాలంలో పిసి కంటే కూడా మొబైల్‌నే పిసి లాగా వాడుతున్నారు. అందుకు కారణం ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉంటే మన చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. మొబైల్ టెక్నాలజీ అంతలా డెవలప్ అయింది మరి.

మొబైల్‌లో డేటాను సురక్షితం చేసుకోవడానికి ప్రత్యేక అప్లికేషన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ వాడుతున్నట్లయితే File Lockerతో ముఖ్యమైన ఫైల్స్‌ని పాస్‌వర్డ్‌తో కాపాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మార్కెట్‌ నుంచి దీన్ని పొందొచ్చు. అన్ని వెబ్‌ సర్వీసుల పాస్‌వర్డ్‌ వివరాలు, బ్యాంకు ఎకౌంట్‌ నెంబర్లను ఒకేచోట సురక్షితం చేసుకోవడానికి Pocket ఉంది. మాస్టర్‌ పాస్‌వర్డ్‌తో భద్రం చేసుకోవచ్చు.

ఐఎస్‌ఓ ఓఎస్‌తో పని చేసే యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారులు Enlume Password Managerతో సురక్షితం చేసుకోవచ్చు. ఇలాంటిదే మరోటి TheVault. దీంట్లో ఫొటోలు, స్క్రీన్‌షాట్‌, ఫైల్స్‌ని కూడా సురక్షితం చేసుకునే వీలుంది. ఇక బ్లాక్ బెర్రీ మొబైల్ వాడుతున్న యూ 'ఐలాకర్‌ లైట్‌'తో డేటా సురక్షితం. పాస్‌వర్డ్‌తో మాత్రమే వాడేలా చేయవచ్చు. అప్‌ వరల్డ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాల భద్రతకు Password Manager Secret Server సిద్ధంగా ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting