అంత రహస్యంగా ఏలా ఉంచారు?

By Prashanth
|
Galaxy S3


నిర్మాణ దశ నుంచే భారీ అంచనాలు రేకెత్తించిన స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 2012, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ప్రకటించబడిన ఈ డివైజ్ పై ఆది నుంచి ఉత్కంఠ నెలకుంది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్లకు సంబంధించి అనేకమైన పుకార్లు షికార్లు చేసాయి. వీటన్నింటిని ఖండిస్తూ వచ్చిన సామ్‌సంగ్ అంతిమంగా కొత్త అనుభూతులతో కూడిన సాంకేతిక సమాచారం పరిజ్ఞానాన్ని గెలాక్సీ ఎస్3 రూపంలో ప్రప్రంచానికి అందించింది.

ఈ ఫోన్ నిర్మాణానికి సంబంధించిన కీలక వివరాలు బయటకు పొక్కకుండా తీసుకున్న జాగ్రత్తలకు సంబంధించి కీలక అంశాలను, సామ్‌సంగ్ ఇటీవల తమ అధికారిక బ్లాగ్ ద్వారా బహిర్గతం చేసింది. భద్రతా కారణాల రిత్యా సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్3 నిర్మాణ పనులను ప్రత్యేక ప్రయోగశాలలో నిర్వహించింది. ముఖ్యమైన వారికి మాత్రమే ఈ ప్రయోగాశాలలోకి అనుమతించారు. ఆవిష్కరణ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశాలకు ఇంజనీర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు హాజరుకాకుండా చర్యలు తీసుకున్నారు.

హ్యాండ్‌సెట్‌ల ప్యాకింగ్‌కు సంబంధించి కంపెనీ ప్రత్యేక ప్రోటో టైప్ బాక్సులను డిజైన్ చేసింది. ఫోన్ డెలివరీ బాధ్యతను థర్డ్ పార్టీ సభ్యులకు అప్పజెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంది. గెలాక్సీ ఎస్3 భద్రతకు సంబంధించి సామ్‌సంగ్ చేపట్టిన పకడ్బందీ చర్యలు విజయంలో కీలక పాత్ర పోషించాయి.

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర రూ.43,180.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X