షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
మెటల్ బాడీ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు ఇండియన్ యూజర్ల నుంచి పాజిటివ్ టాక్ వ్యక్తమవుతోంది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను షియోమీ అందుబాటులో ఉంచింది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.11,999.

స్పెక్స్ విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే మీరు చేయవల్సిన 10 ముఖ్యమైన పనులను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది...
Read More : గూగుల్ కంపెనీలో భోజనం ఎలా ఉంటుంది..?

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
డివైస్‌ను అన్‌బాక్స్ చేసిన తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లే ముందు ఫోన్‌ను కనీసం రెండు గంటల పాటు ఛార్జ్ చేయండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
రెండు గంటల పాటు ఛార్జింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఫోన్ స్విచ్ ఆన్ చేయండి. పవర్ బటన్‌ను 3 సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఫోన్ స్విచ్‌ఆన్ అయిన తరువాత లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, English (United Kingdom) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
లాంగ్వేజ్ ఎంపిక పూర్తి అయిన తరువాత స్థానికతను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, Indiaను సెలక్ట్ చేసుకోండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
లాంగ్వేజ్ ఇంకా లొకాలిటీ ఎంపికలు పూర్తి అయిన తరువాత డీఫాల్ట్ కీబోర్డ్ ఆప్షన్‌ను యూజర్ ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ Google Keyboardను సెలక్ట్ చేసుకోండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఫోన్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు అంగీకారం తెలిపి వై-ఫై లేదా డేటా ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఫోన్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో సిమ్ స్లాట్ కనిపిస్తుంది. ఈ స్లాట్‌లో మీ సిమ్‌కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అవ్వండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
మీ ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసిన స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అయిన తరువాత ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసుకోమని ఫోన్ సూచిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా యూజర్ తన వేలిముద్ర ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. వద్దనుకుంటే ఈ ఆప్షన్ నుంచి స్కిప్ కావొచ్చు.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఫోన్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి.

షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఇప్పుడిక మీ ఫోన్ వాడేందుకు రెడీ.

Click it and Unblock the Notifications