లక్షల సార్లు వొంచినా ఆ డిస్‌ప్లేలు విరగవు!

గతకొద్ది సంవత్సరాలుగా మనం గమనిస్తున్నట్లయితే స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

|

గతకొద్ది సంవత్సరాలుగా మనం గమనిస్తున్నట్లయితే స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి స్ర్కీన్ పరిమాణం విషయంలో రకరకాల డిస్‌ప్లే డిజైన్స్ మార్కెట్లోకి పుట్టుకొస్తున్నాయి. అతిత్వరలోనే బెండబుల్ స్ర్కీన్‌లతో కూడిన ఫోన్‌లను కూడా మనం వినియోగించుకోబోతున్నాం.

వాస్తవికతను అద్దుకోబోతున్న బెండబుల్ ఫోన్స్..

వాస్తవికతను అద్దుకోబోతున్న బెండబుల్ ఫోన్స్..

ఎల్‌జీ, సామ్‌సంగ్ వంటి దిగ్గజ ఫోన్ తయారీ కంపెనీలు బెండబుల్ స్ర్కీన్‌ల తయారీ పై ఇప్పటికే తమతమ పరిశోధనలను ముమ్మరం చేసాయి. ఈ రేసులో ఒకడుగు ముందున్న ఎల్‌జీ, G Flex పేరుతో ఓ కర్వుడ్ స్ర్కీన్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా కర్వుడ్ సైడ్‌వేస్‌తో కూడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది.

ప్రయోగాలు విజయవంతమవుతుండటంతో...

ప్రయోగాలు విజయవంతమవుతుండటంతో...

ఈ ప్రయోగాలు విజయవంతమవుతుండటంతో పూర్తిస్థాయి బెండబుల్ స్ర్కీన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రముఖ బ్రాండ్‌లు మొగ్గు చూపుతున్నాయి. ఈ ట్రెండ్ పై IHS Markit సంస్థకు చెందిన ప్రముఖ అనలిస్ట్ డేవిడ్ హ్సీహ్ (David Hsieh) స్పందిస్తూ ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

 

 

7 అంగుళాల బెండబుల్ స్ర్కీన్‌తో సామ్‌సంగ్ ఫోన్...

7 అంగుళాల బెండబుల్ స్ర్కీన్‌తో సామ్‌సంగ్ ఫోన్...

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ డిస్‌ప్లే తయారీ కంపెనీ బీఓఈ (BOE) ఇప్పటికే 7.56 అంగుళాల నిడివితో కూడిన ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లేను తయారు చేసింది. ఈ డిస్‌ప్లేను లక్ష సార్లు బెండి చేసినప్పటికి బ్రేక్ అవ్వదని కంపెనీ చెబుతోంది. తైవాన్‌కు చెందిన మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏయూఓ (AUO), ఓ 5 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేను అభివృద్థి చేసింది. ఈ డిస్‌ప్లేను 15 లక్షలు కంటే ఎక్కువసార్లు బెండ్ చేసినప్పటికి బ్రేక్ అవ్వలేదట. తన బెండబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకువచ్చే క్రమంలో బీఓఈ సంస్థ ఇప్పటికే హువావే కంపెనీతో చర్చలు జరుపుతోందట. ఈ రేసులో అందరికంటే మందంజలో ఉన్న సామ్‌సంగ్ ఓ 7 అంగుళాల బెండబుల్ స్ర్కీన్ ఫోన్‌ను ఇప్పటికే తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

డిస్‌ప్లేలు ఏమాత్రం పగలవు..

డిస్‌ప్లేలు ఏమాత్రం పగలవు..

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న కర్వుడ్ స్ర్కీన్‌లు చాలా సులువుగా పగిలిపోతున్నాయి. Toluna అనే ప్రముఖ రిసెర్చ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ సంవత్సరానికి 7 సార్లు క్రింద పడేస్తున్నారట. వీటిలో సగం పైగా డ్రాప్స్ ఒక మీటర్ కంటే ఎత్తయిన ప్రదేశం నుంచే ఉంటున్నాయట. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సామ్‍‌సంగ్ ఓ సరికొత్త బెండబుల్ ఓఎల్ఈడి ప్యానల్‌ను అభివృద్ధి చేసింది.

 

 

పూర్తిస్థాయి అన్‌బ్రేకబుల్ సబ్‌స్ట్రేట్‌...

పూర్తిస్థాయి అన్‌బ్రేకబుల్ సబ్‌స్ట్రేట్‌...

ప్లాస్టిక్ ఓవర్లేతో అన్‌బ్రేకబుల్ సబ్‌స్ట్రేట్‌ను కలిగి ఉండే ఈ ప్యానల్‌ పూర్తిస్థాయి షాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుందట. ఈ స్ర్కీన్‌ను యూఎస్‌కు చెందిన ప్రముఖ టెస్టింగ్ సంస్థ అండర్‌రైటర్స్ లేబొరేటరీస్ ఇంక్ సర్టిఫై చేసిందట. 1.2 మీటర్ల ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ స్ర్కీన్‌ను 26 సార్లు క్రింద పడేసినప్పటికి ఏ మాత్రం చెక్కుచెదరలేదట. ఇదే సమయంలో కార్నింగ్ సంస్థ కూడా ఓ సరికొత్త గొరిల్లా గ్లాస్ ప్యానల్ ను మార్కెట్లో తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఫ్లాట్ స్ర్కీన్‌ల కోసం అభివృద్థి చేయబడిన ఈ గ్లాస్ ప్యానల్ రిపీటెడ్ డ్రాప్స్ నుంచి సురక్షితంగా బయటపడగలదట.

 

 

పెద్ద డిస్‌ప్లే ఇప్పుడో ట్రెండ్...

పెద్ద డిస్‌ప్లే ఇప్పుడో ట్రెండ్...

గతంలో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 5.5 అంగుళాల ప్యానల్‌ను డీఫాల్ట్ స్ర్కీన్ సైజుగా భావించే వారు. ఆ తరువాత ఫ్రంట్ ఫేసింగ్ బీజిల్స్‌ను ట్రిమ్ చేసేయటంతో 6 అంగుళాల నుంచి 6.3 అంగుళాల సైజు వరకు వివిధ స్ర్కీన్ పరమాణాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ బీజిల్-లెస్ డిస్‌ప్లే ట్రెండ్ ఐఫోన్ ఎక్స్‌తో మొదలవ్వగా సామ్‌సంగ్, షావోమి, ఒప్పో, వివో వంటి సంస్థలు మరింతగా ముందుకు తీసుకువెళుతున్నాయి.

 

 

డిస్‌ప్లే విత్ ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

డిస్‌ప్లే విత్ ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

బిజిల్ లెస్ డిజైన్‌తో తయారవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లకు మరిన్ని కొత్త హంగులను అద్దే క్రమంలో ఫోన్ తయారీ కంపెనీలు బ్యాక్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు స్వస్తి పలికి ఫేస్- ఆధారిత అన్‌లాకింగ్ మెకనిజంను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. IHS Markit రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మరింత గిరాకీ నెలకునబోతోంది.

2019 నాటికి 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు...

2019 నాటికి 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు...

ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ డిస్‌ప్లేలోనే ఏర్పాటు చేయటం జరుతుంది. దీంతో డిస్‌ప్లే పై ఎక్కడ టచ్ చేసినా ఫోన్ అన్‌లాక్ అయిపోతుంది. ఐహెచ్ఎస్ మార్కెట్ చెబుతోన్న దాని ప్రకారం 2019 నాటికి ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యం కాబోతున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
How smartphone displays will look like over the next few months.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X