సెల్‌ఫోన్‌ తయారీ సంస్థగా గూగుల్‌

Posted By: Super

సెల్‌ఫోన్‌ తయారీ సంస్థగా గూగుల్‌

న్యూయార్క్‌: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి మొబైల్‌ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ప్రముఖ సెల్‌ఫోన్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థ మోటరోలా మొబిలిటీ బిజినెస్‌ను 12.5 బిలియన్‌ డాలర్లు (సుమారు 5,630 కోట్ల రూపాయలు) వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ మొబైల్స్‌కు అవసరమైన ఆపరేటింగ్‌ వ్యవస్థలను మాత్రమే అందిస్తున్న గూగుల్‌ ఇకపై దాన్ని వినియోగిస్తూ, అన్ని రకాల ధరల శ్రేణుల్లో సెల్‌ఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. మోటరోలా మొబిలిటీ హోల్డింగ్స్‌ కోసం ఒక్కో వాటాకు 40 డాలర్ల చొప్పున గూగుల్‌ చెల్లించి సంస్థలో 63 శాతం వాటాలను కొనుగోలు చేసింది.

2007లో తాము విడుదల చేసిన ఆండ్రాయిడ్‌ వ్యవస్థ ఆధారంగా గూగుల్‌ తయారు చేసే సొంత బ్రాండ్‌ మొబైల్‌ త్వరలోనే ప్రపంచాన్ని తాకవచ్చని సంస్థ చీఫ్‌ లారీ పేజ్‌ వ్యాఖ్యానించారు. వృద్ధి దిశగా గూగుల్‌ ఎటువంటి వ్యూహాత్మక అడుగులు వేయనుందని ప్రశ్నించే వారికి ఇదే తమ సమాధానమని ఆయన అన్నారు. కాగా, ఇటీవల ఐబిఎం నుంచి 1000కి పైగా పేటెంట్లను గూగుల్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోటరోలా వద్ద ఉన్న 17 వేలకు పైగా పేటెంట్లపైనా గూగుల్‌కు హక్కులు లభించాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot