EMI ఆప్షన్ పై స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయటం ఎలా..?
స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి చాలా మంది యూజర్లు తమ నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను ఈఎమ్ఐ పద్ధతిలోనే కొనుగోలు చేస్తున్నారు.
తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే క్రమంలో అమెజాన్, ఫిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కొనుగోళ్ల పై నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఇన్‌స్టెంట్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ పేర్లతో వివధ రకాల ఆఫర్లను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇక స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి చాలా మంది యూజర్లు తమ నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను ఈఎమ్ఐ పద్ధతిలోనే కొనుగోలు చేస్తున్నారు. EMI పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయటం ద్వారా మొత్తం అమౌంట్ ఒకేసారి చెల్లించకుండా ప్రతినెలా కొంచం కొంచంగా చెల్లిస్తే సరిపోతుంది. ఈఎమ్ఐ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారి వద్ద తప్పనసరిగా క్రెడిట్ కార్డుతో పాటు అందులో సరిపడా క్రెడిట్ లిమిట్ ఉండాలి. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా EMI ఫీచర్‌ను ఉపయోగించుకుని స్మార్ట్‌ఫోన్‌లను ఏ విధంగా కొనుగోలు చేయాలనే దాని పై స్టెప్ బై స్టెప్ గైడ్‌ను మీకు అందించటం జరుగుతోంది.

ముందుగా మీ దగ్గర ఉండాల్సినవి
మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మార్కెట్లో ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఈఎమ్ఐ పద్థతిలో కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీ వద్ద క్రెడిట్ కార్డుతో పాటు అందులో సరిపడా క్రెడిట్ లిమిట్ ఉండాలి. ఈఎమ్ఐ ఆప్షన్‌ను అన్ని రకాల ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్ల పై వినియోగించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు క్రెడిట్ కార్డ్ తప్పనసరిగా మీ వద్దనే ఉండాలి. లావాదేవీ జరిగే సమయంలో కార్డు తాలుకా లావాదేవీకి సంబంధించిన ఓటీపీ ఒకటి మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటపుడు...
ముందుగా మీరు ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటోన్న రిటైల్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత మీరు కొనుగోలు చేయాలనుకుంటోన్న స్మార్ట్‌ఫోన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఫోన్ సెలక్ట్ అయిన తరువాత ‘Buy Now' ఆప్షన్ పై టాప్ చేసి అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. తదుపరి స్టెప్‌లో భాగంగా payment optionsలోకి వెళ్లి EMI పేమెంట్ మోడ్‌ను సెలక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి.

ఈఎమ్ఐ టైమ్ పిరియడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి..
తరువాతి స్టెప్‌లో మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాంకును సెలక్ట్ చేసుకుని ఈఎమ్ఐ టైమ్ పిరియడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ టైమ్ పిరియడ్ అనేది 3 నెలల నుంచి 24 నెలల మధ్య ఉంటుంది. టైమ్ పిరియడ్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే లావాదేవీకి సంబంధించిన ఓటీపీ ఒకటి బ్యాంకుతో రిజిస్టర్ అయి ఉన్న మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేటపుడు...
ముందుగా మీరు ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటోన్న ఆఫ్‌లైన్ రిటైలర్ వద్దకు వెళ్లి ఫోన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సెలక్ట్ చేసుకున్న తరువాత ముందుగా పేమెంట్‌ను క్రెడిట్ కార్డు ద్వారా పూర్తి చేసి ఆ తరువాత ఈఎమ్ఐలలోకి కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది.


Click it and Unblock the Notifications








