Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా వచ్చిన డయల్‌ ప్యాడ్‌ మీకు నచ్చలేదా.. పాత ఇంటర్‌ఫేస్‌ కోసం ఇలా చేయండి..!

Smartphone New Dialer Interface : ఇటీవల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డయల్‌ స్క్రీన్ లో అనేక మంది మార్పులు వచ్చాయి. అయితే కొంత మంది తమ ఫోన్‌లు హ్యాక్ అయ్యాయనే ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక అసలు కథ తెలిసాక, కాస్త రిలాక్స్‌ అయ్యారు. గత వారంలో సోషల్ మీడియాలోనూ దీనిపైనే చాలా వరకు చర్చ జరిగింది. గూగుల్‌ ఫోన్‌ యాప్‌ అప్‌డేట్‌ కారణంగా ఈ తరహా మార్పులు వచ్చాయి.

ఎలాంటి మార్పులు వచ్చాయి :
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డయల్‌ ఇంటర్‌ఫేస్‌ మారిపోవడంతో అనేక మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్ మెటీరియల్‌ 3 ఎక్స్‌ప్రెసివ్ రీ డిజైన్‌ కారణంగా ఈ మార్పులు వచ్చాయి. ఫలితంగా కాల్స్‌ వేర్వేరుగా లిస్టింగ్‌, కాల్‌ హిస్టరీ, ఫేవరెట్స్‌ వంటివి హోమ్‌ ట్యాాబ్‌లో కనిపిస్తున్నాయి. దీంతోపాటు మిస్డ్‌, స్పామ్, కాంటాక్స్ట్‌ ను ఫిల్టర్‌ ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది.

How to delete new dialer interface

ముందస్తు సమాచారం లేకుండానే మార్పులు :
అయితే ఈ అప్‌డేట్‌ గురించి ఎటువంటి ముందస్తు వివరాలు అందించలేదు. మరియు యాప్‌ అప్‌డేట్‌ ద్వారా కాకుండా నేరుగా గూగుల్‌ సర్వర్ సైడ్‌ యాక్టివేషన్‌ ద్వారా డయల్‌ ఇంటర్‌ఫేస్‌ లో మార్పులు వచ్చాయి. అయితే ఈ అప్‌డేట్‌ పై కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరి కొంత మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే :
దీంతో అనేక మంది పాత డిజైన్‌ కు మార్పుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో చిన్న మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే.. గూగుల్‌ తన భవిష్యత్‌ అప్‌డేట్‌ ద్వారా ఫోన్‌ యాప్‌ అప్‌డేట్‌ ను తప్పని సరి చేసే అవకాశం ఉంది.

కొత్తగా వచ్చిన అప్‌డేట్‌ ను అన్‌ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ పాత డయల్‌ ఇంటర్‌ఫేస్‌ ను పొందవచ్చు.
> గూగుల్‌ ప్లేస్టోర్‌ను ఓపెన్‌ చేయండి.
> Phone By Google అని సెర్చ్‌ చేయండి.
> ఆ యాప్‌ ను సెలెక్ట్‌ చేసి Uninstall చేయండి.
> దీని వల్ల యాప్‌ మొత్తం డిలీట్‌ కాకుండా, కేవలం కొత్తగా వచ్చిన అప్‌డేట్‌ మాత్రమే డిలీట్‌ అవుతుంది.
> అన్‌ ఇన్‌స్టాల్‌ చేయడం పూర్తయ్యాక, స్మార్ట్‌ఫోన్‌ ను రీస్టార్‌ చేయాల్సి ఉంటుంది.

మళ్లీ అప్‌డేట్‌ కాకుండా ఉండాలంటే :
అయితే యాప్‌ మళ్లీ అప్‌డేట్‌ కాకుండా ఉండాలంటే.. గూగుల్‌ ప్లే స్టోర్‌ కు వెళ్లాలి > అదే యాప్‌ లో కుడివైపున త్రీ డాట్‌ మెనూ పైన క్లిక్ చేయాలి > అక్కడ కనిపించిన Enable Auto Update ఆప్షన్‌ ను ఆఫ్‌ చేసుకోవాలి.

Take a Poll

అయితే ఇలా అప్‌డేట్స్‌ ను ఆఫ్‌ చేసుకోవడం వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా మాన్యువల్‌ గా అప్‌డేట్‌ ను తనిఖీ చేస్తుండాలి. మీకు అవసరం అయిన అప్‌డేట్‌ కనిపిస్తే మాన్యువల్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to delete new dialer interface in android smartphones here are the steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X