Home
Mobile

Instagram Read Receipts ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఫీచర్ గురించి తెలుసా.. ఎలా ఉపయోగపడుతుంది?

మెటా నేతృత్వంలోని ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇటీవల కాలంలో వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం అనేక ఫీచర్ల ను తీసుకొస్తోంది. ఇటీవల ఇన్‌స్టా స్టోరీస్‌లో మ్యూజిక్‌ ట్రాక్‌ లను యాడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. తాజాగా వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని (Instagram Read Receipts feature) సూపర్ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ వా‌ట్సాప్‌ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్‌ లో అందుబాటులో ఉన్న Read Receipts ఫీచర్‌ ప్రస్తుతం ఇన్‌స్టా్గ్రామ్‌ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్ల ప్రైవసీ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. వ్యక్తిగత ఛాటింగ్‌ పై పూర్తి నియంత్రణ పొందవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా మీకు వ్యక్తిగతంగా వచ్చిన మెసేజ్‌ను మీరు చూసినా (Seen).. పంపిన వారికి తెలిసే అవకాశం ఉండదు.

How to Enable and use Instagram Read Receipts feature

ఫలితంగా యూజర్ల పైన ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన మెసేజ్‌ లకు మాత్రమే వెంటనే స్పందించేలా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ లో Read Receipt ఫీచర్‌ ద్వారా అందరితోపాటు వ్యక్తిగత చాట్‌లను వేర్వేరు గా ఆఫ్‌ చేయవచ్చు. సెట్టింగ్స్‌ మరియు ప్రైవరీ ఫీచర్‌ లో మార్పులు చేయవచ్చు. అంటే ఎంపిక చేసిన చాట్‌ లకు ఈ ఫీచర్‌ ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ అన్ని చాట్‌ లకు Read Receipts ఆఫ్ చేయడం ఎలా ?
స్టెప్‌ 1 : అన్ని చాట్‌ లకు రీడ్‌ రిసీప్ట్‌ లను ఆఫ్‌ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ను ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ మరియు ప్రైవసీ లోకి వెళ్లాలి.
స్టెప్‌ 2 : అనంతరం కింద కు స్ర్కోల్‌ చేయాలి.

స్టెప్‌ 3 : అక్కడ Messages and Story Replies ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : అనంతరం Show Read Receipts ఆప్షన్‌ ను క్లిక్‌ చేయాలి.
అయితే Read Receipts ఫీచర్‌ను ఎంచుకున్న చాట్‌ లకు కూడా వర్తింపచేయవచ్చు.

స్టెప్‌ 1 : ఈ ఫీచర్‌ ను ఎంపిక చేసుకున్న చాట్‌లకు కూడా వర్తింప చేయవచ్చు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్ వ్యక్తిగత చాట్‌లకు వెళ్సాల్సి ఉంటుంది.
స్టెప్ 2 : వ్యక్తిగత చాట్‌లోకి వెళ్లి ప్రొఫైల్‌ ఐకాన్‌పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : ప్రైవసీ మరియు సేఫ్టీ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : అనంతరం అక్కడ కనిపించిన Read Receipts ఆప్షన్‌ను (Enable) ఆన్‌ చేయాలి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
How to Enable and use Instagram Read Receipts feature here is the step wise guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X