మీ ఫోన్ పదేపదే ఓవర్ హీట్ అవుతోందా..?

మనరోజు వారి కమ్యూనికేషన్ అవసరాల రిత్యా ప్రతిరోజు ఫోన్‌లలో అనేక టాస్క్‌లను నిర్వహిస్తుంటాం. ఈ క్రమంలో, ఫొన్ పై కొన్నిసార్లు ఒత్తిడి పెరిగి ఓవర్ హీటింగ్ సమస్యలకు దారితీస్తుంది. ఫోన్‌లలో సీపీయూ స్పీడ్ ఓవర్‌క్లాకింగ్ అవటం ద్వారా ఓవర్ హీటింగ్ అనేది సంభవిస్తుంటుంది. ఈ సమస్య తరచూ ఎదురవుతున్నట్లయితే ప్రాసెసర్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. ఓవర్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ సింపుల్ టిప్స్‌ను అప్లై చేయటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్కువ సేపు అలా చేయకండి..

ఫోన్‌లలో ఎక్కువ సేపు వీడియో కాల్స్ చేయటం, గ్రాఫికల్ గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయటం వల్ల ఓవర్‌హీట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పనులను దాదాపుగా తగ్గించుకోండి.

ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసిరి..

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు ఫోన్‌కు బ్రేక్ ఇవ్వండి.

కంపెనీ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి

ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. పగటి ఉష్ణోగ్రతల్లో ఫోన్‌లను ఎక్కువ సేపు ఛార్జ్ చేయకండి. పగటి పూట 70 నుంచి 80శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేసి, రాత్రిపూట మాత్రం ఫుల్ ఛార్జ్ చేయండి.

 

అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయండి..

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

నాసిరకం బ్యాటరీల కారణంగా...

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి.

వెంటిలేషన్ అనేది చాలా అవసరం

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లకు వెంటిలేషన్ అనేది చాలా అవసరం. కాబట్టి అస్తమానం మీ ఫోన్‌లను జేబులోనే ఉంచకండి. ఇలా చేయటంలో ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అప్పుడప్పుడు ఫోన్‌లను బయటకు తీసి కొంచం వెంటిలేషన్ అందేలా చూడండి. మంచు వాతావరణంలో ఉన్నప్పుడు ఫోన్‌లను జేబులోనే ఉంచుకోవటం మంచిది.

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..?

 ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో

 కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

సాధ్యమైనంత వరకు ఫోన్ బ్యాక్ కవర్‌లను ఉపయోగించకండి

వేసవి కాలంలో సాధ్యమైనంత వరకు ఫోన్ బ్యాక్ కవర్‌లను ఉపయోగించకండి. ఫోన్‌లోని జంక్ ఫైల్స్, కుకీస్, అలానే క్యాచీ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా సీపీయూ ఇంకా ర్యామ్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా ఫోన్ ఓవర్ హీటింగ్ కు దూరంగా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Fix Overheating Issues of Android Devices. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot