మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?

Posted By: Prashanth

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా...?, బ్యాటరీ శక్తిని పొదుపు చేసుకునే మార్గాల కోసం ఆన్వేషిస్తున్నారా..?, ఇవిగోండి బ్యాటర్ బ్యాకప్‌ను పొదుపుచేసుకునే విలువైన మార్గాలు.......

పవర్ కంట్రోల్ అప్లికేషన్:

కొద్ది పాటి చోటను ఆక్రమించే ఈ అప్లికేషన్ హోమ్‌స్ర్కీన్ విడ్జెట్‌లాగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ అవసరంలేని సమయాల్లో వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్ లను ఆఫ్ చేస్తుంది. అంతేకాదండోయ్ మీ స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను సైతం అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరుగుతుంది.

మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌లను మార్చుకోండి:

మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌ను సవరించటం వల్ల బ్యాటరీని పొదుపు చేసుకోవచ్చు. మెయిల్ వీక్షణ అలర్ట్‌ను నిమిషాల నుంచి గంటలకు అప్‌డేట్ చేస్తే సరిపోతుంది.

ఫైన్-ట్యూన్ స్ర్కీన్ బ్రైట్‌నెస్:

స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీని మరింత ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్టి డిస్‌ప్లే ఐకాన్‌ను ఎంపిక చేసి బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటే సరిపోతుంది.

స్మార్ట్ పవర్ అప్లికేషన్ సెట్టింగ్స్:

అవసరం మేరకు ఉపయోగపడే అప్లికుషన్‌లను మాత్రమే ఓపెన్ చేసుకోవటం మంచిది. అప్లికేషన్‌లు ఇతర డేటాను డౌన్‌‌లోడ్ చేసుకునే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను చార్ఝింగ్‌‍లో ఉంచటం మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot