మీ ఫోన్‌లో అలాంటి యాప్స్ ఉన్నాయా..?
కొన్ని సందర్బాల్లో యూజర్‌కు తెలియకుండానే పనికిరాని యాప్స్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ కాబడతాయి.
మరే ఇతర ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్‌ను నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మనకు తెలియకుండానే యాప్స్...
ముఖ్యంగా మన ఆండ్రాయిడ్ డివైస్‌లలో మనకు తెలియకుండానే మాల్వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంటుంది. కొన్ని సందర్బాల్లో యూజర్‌కు తెలియకుండానే పనికిరాని యాప్స్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ కాబడతాయి. ఇలాంటి యాప్స్ ప్రమాదకర మాల్వేర్‌లను సృష్టించి డివైస్‌కు నష్టం చేకూరుస్తాయి. మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోకి పనికిరాని యాప్స్ చేరకుండే ఉండేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

సెక్యూరిటీ సెట్టింగ్‌లను ఇలా చెక్ చేసుకోండి
ఫోన్ Settings>Security>Unknown sources and uncheck allow installation of apps from (unknown sources)

ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి
గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎడమ వైపు పై కార్నర్‌లో కనిపించే మూడు గితల ఆప్షన్ పై టాప్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి.

అటువంటి యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి..
కొన్ని సమయాల్లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ యాడ్వేర్‌లను కలిగి మీ అనుమతి లేకుండానే డివైస్‌లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.


Click it and Unblock the Notifications








